పుట:Kavitvatatvavicharamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90 కవిత్వతత్త్వ విచారము బయటఁ బోయి విహరించి వత్తమని కుచకుంభములు పక్షులరీతిఁ గొట్టుగొనుచున్నవఁట ! బొడ్డు నొక సొగసు ! అది పొన్న విరి ! ఆయమ్మయూరువులు ఏనుగు తొండములకంటె నెక్కువ ! అన్నిఁటి కైనను మీఱిన తుచ్ఛసామ్యమం జూడుడు. జంఘులు శాలిగర్భ ములు. వజ్రాల కాంతి నీళ్ళు. అందెలు మళ్ళు. మీఁగాళ్ళు కచ్ఛపములు ! బురదయే మో కవి చూపలేదు ! ఒక వేళ నీవర్ణనమే కాబోలు ! ఇట్టి బలత్కారోపములకుం బూనినచో, గాడిదె, గుఱ్ఱము, క్రోఁతి, కొంగ మొదలగు ప్రపంచకములోని యే వస్తువుతో నైన స్త్రీలచc బోల్చి వర్ణింపవచ్చుగదా ! సరే కాని నాకొక సందేహము. ఇంత విశదముగ భాగభాగమును బెదవుల చప్పరించుచు శుచిముఖి వర్ణించెఁగదా ! దాని క్రీయంగోపాంగదర్శన మెట్లబ్బెనో ! పూర్వము కన్యామణులు కోకలువిప్పి తాండవమాడుచుంట గలదా ! లేక యందఱికిని వస్త్రములను మానమును వ్యర్ధముచేయు దివ్యదృష్టి యుండెనా ? మఱియు, పింగళిసూరన్న కృతులలో పాత్రములు సాధారణముగ దీర్ఘ చర్చల జేయరు. కవి బహుచమత్కారముగ మాటమీఁద మాటవచ్చి విషయము విశదమగునట్లు సంభాషణ లేర్పఱుచును. నాటక కౌశలమని పేర్కొనఁబడిన ప్రతిభలో నిది యొక కళ. ఈ శక్తిలో నితఁడు తిక్కనతో సమానుఁడన్నను బైమాటగాదు. నిదర్శన మిక ముందు నివేదింతును. ఇంత సమర్ధు డయ్యును అంగవర్ణనా శృంగారమునకుం బూనెనేని యాశ క్తిఁ గోలు పోయినవా (డౌట యెంతయు ఁ జింతనీయము. శుచిముఖి యొక్క యుపన్యాసము ముప్పది పద్యములకన్న నెక్కువ. ఇంత సేపు బ్రద్యుమ్నుఁడు నోరు చచ్చిన జీవంబుపలె నిలుచుండుటc జూడ, అతనికే కాదు, మనకుఁగూడ నలసట ! పాత్రములను ముందు నిల్పిన పిమ్మట నెల్లరు నప్పుడప్పుడే మైనఁ జేయుచున్ననే వినోదము. ఒకరు నోరు బ్రద్దలగునట్లు మాటాడుచు తక్కినవారు కొయ్య బొమ్మలరీతిని, పల్లెటూరివాండ్రవలెను, నోరుదెరచికొని ఱెప్ప వేయక నిలువఁబడియుండిన ప్రకృతికి రసమునకు రెండిఁటికిని కీడు. సామాన్యులగు కవులలో నీ దోషము లుండిన విచారము లేదు గాని, మహా కవియు సంభాషణ రచనలలో దక్షుడునైన సూర నార్యుఁడీ లోపమున వ్రాలుట మనసుగుందించు చెడుగు .<poem>

                ప్రభావతి యొక్క కామనిర్భరత యేవంపుఁబాటుగా దోcచునే

కాని రమణీయమని యెన్పుట దుస్తరము. వచ్చిన యావేశముం జూడుఁడు.