పుట:Kavitvatatvavicharamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 కవిత్వతత్త్వ విచారము

గాదు. మఱి ర కిలేమి చేనని యనుమానించుట సహేతుకము. ఏది యెట్లుండె. లోకులును, అనఁగా పండితులన్నమాట, రాఘవ

పాండవీయమును బంచ మహాకావ్యములలో నొకటిగా ననుగ్ర
హించి రే కాని అఖండభావ గాంభీర్యమైన కళాపూర్ణోదయమునకు
నట్టి పట్టము గట్టరైరి. ఐన నిదియొక యెదురు చూడబడని వింత
గాదు.
                         కవి యొక్క ప్రతిజ్ఞయు దత్ఫలములును
   ఈ కావ్యము యొక్క గుణదోషములు రెండింటికిని నాస్పద
మైనది సూరనార్యుడు ప్రారంభమునఁ జేసికొన్న ప్రతిజ్ఞయ. కృతి 

నిర్మాణ విషయమైన సంకల్పమును గవి యే వివరించియున్నాఁడు.

చూడుడు. "సకల లక్షణ లక్షితంబైన మహా ప్రబంధంబు కీర్తి
కారణంబుని...యెద్దియే నొక్క సరస ప్రబంధ నిబంధనమునకు "

గౌతూహలియై యుండునపుడు, రాజుగారు "నిర్దిద్రలీలావిచిత్రంబగు దానిం" జేయుమని యాజ్ఞాపింపఁగా, ప్రభువుగారి గౌరవమునకును

దన శక్తికిని దగినరీతి "నపూర్వకథాసంవిధాన వైచిత్రీమహనీయం
బును, శృంగారరస ప్రాయంబును, బుణ్యవస్తువర్ణనా కర్ణనీయం
బును నగు కళాపూర్ణోదయంబను మహాకావ్యంబు" రచింపఁ గడం
గెను ! కవి యొక్క యుద్దేశమే యీ గ్రంథ మిన్ని లక్షణముల
గలియుండవలయునని. కవి తన యఖి మతము నెఱవేర్చికొన్నాఁడు
ಗ್ನಿ, ಯುಲ್ಲು పంతముఁబట్టి వ్రాసినందున నిష్కళంకమైన కృతి
యేర్పడినదా లేదా యనుట సందేహము! కథ యు ప్రకృతియందలి 

వస్తువులవలె దనంతటఁ దనయందలి సత్త్వముంబట్టి పుట్టి

పెరుగు గుణముగలది. దానిని సాజముగ పెరుగనిచ్చి, యప్పు
డప్పడు సవరించుచు సంస్కరించుచు దోహదము చేయుచు వచ్చిన
మేలా ? మొదటినుండి యే యీయివా రసములు తప్పక యిచ్చెడు
దానిని గల్పించెదను అని సంకల్పించుకొని పిమ్మటి దాని యుత్పత్తిఁ
జేయుఁజూచుట మేలా ? యోజింపడు. భావనాశక్తి కారణశక్తి
యొక్క సేవనమునకు నిల్చిన మహత్తు గాదు. మఱి స్వైరిణి.
గుఱ్ఱముల నడిపినట్లు గతి వేగము గుదించి త్రిప్పి కొంతకుఁ గొంత 

వశ్యము చేసికొన నగుఁగాని, యపరిమితముగా దాని స్వేచ్ఛావిహార

మును నివారించితి మేని అది చెడును. పరిశ్రమము తగినంత లేమి
మందమగును. కృశించి నశించినను నశించునే మో ! సకల లక్షణ
లక్షితములు ఐహిక సంప్రదాయముల ప్రకారము నిర్లక్ష్యములు.