పుట:Kavitvatatvavicharamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 47

నున్నదనుట యందఱకుఁ దెలిసిన సంగతియ. ఈ గ్రంథములోని కథలు హిందూ దేశము నుండి పారసీకమున కాక్రమించి, యక్కడ నుండి ఇటాలియా మొదలైన యూరోపు ఖండములోని దేశములం దంతటను నాలుగువందల యేండ్ల క్రిందటనే వ్యాపించినందున నవి పారంపర్యముగ నాయా జాతులవారిలోఁ బ్రచారముననుండు గాథ లంబోలె సర్వసాధారణములైనవి. చరిత్రజ్ఞానములేని పాము రులు పరభాషనుండి దిగుమతియైన సారమనియైన నెన్నక తమ స్వభాషయందే యావిర్భవించినదనియు నెంచుటం దలపోసితిరేనిఁ మనవలె జాతి మత వర్ణాదుల వ్యత్యాసముక తన పూజ్యుఁడైన మనువు యొక్క సంతతివారో కారోయను సంశయమునకుఁ బాత్రు లైన విదేశీయులచేతను, నీ గ్రంథ మెంత గాఢముగ స్వీకరింపబడిన దనుట విశదమవును. ఇట్లు లోకులెల్లరచేఁ బ్రీతితోను శ్లాఘముగాను జూడఁబడిన కావ్యము భావనాశక్తి విరహితమని కాని, తప్ప ద్రోవల బోయినదని కాని చెప్పవలనుపడునా? మఱియు నీ గ్రంథము నిరుపమానము గాదు . ఇట్టివి యింకను ననేకములు సమస్తదేశ ముల భాష లందు ను గలవు. మనదేశములోనే యీ హితోపదేశము నకు నెన్నియో మడుంగులు మిన్న యనందగు బృహత్కథ* యుండలేదా? భారత, భాగవత, రామాయణాtదులలోను మృగ పక్షి వితానములు దేవ మనుష్య భావములం దాల్చినవి గావా ? మఱియు, అస్త్రములు, కామరూపధారణము, భూత భేతాళ వశీ కరణము, ఇత్యాది మహేంద్రజాలములు పుంఖాను పుంఖములుగ గ్రంథములనే కాదు తరతరములుగ తల్లి బిడ్డలు చెప్పకొనెడు ఊcకుడు కథలందు ను గానబcడియో డి. శుద్ధముగఁ బ్రకృతి విరుద్ధములై యున్నయెడల వీనికిట్టి వ్యాప్తి సేకూరియుండదు . నిర్లేతుక జాయమానసిదులు ప్రపంచ వ్యవహారములలో న హి ! అట్లగుటc గారణము విచార్యము. చూడుడు. చిన్న చిన్న బిడ్డలు, చీమలు, కుక్కలు, చిలుకలు, పిల్లులు మొదలగు హీనజాతి జంతువులకు సైతము నరత్వ మూరోపించి మూటలాడఁగోరుట, కోపించుట, స్నేహించుట మొుద చేష్టల నొకరు చెప్పక చూపకయు తమంత నవలoబించుట


  • బ్ర. శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు దీనిని మిగులఁ జక్కని వచన శైలి నాంద్రీకరించియున్నారు.

రామాయణములో నిది మితిమీఱినదని కొందఱ తీర్మానము.