పుట:Kavitvatatvavicharamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18 కవిత్వతత్త్వ విచారము

l. తాము వ్రాసిన కృతులు భాషాంతరీకరణములయ్యును స్వకపోలకల్పితములగు కావ్యములం బలె నెడతెగని యేకధారగా బ్రవహించునట్లు రచించుట.

2. మాతృకలలోనుండు నసమంజసములు నప్రయోజన ములునైన భాగములను బ్రక్షిప్తములనో సంక్షిప్తములనో చేసి కవితా రసము పలుచనగాకుండునట్లు సాంద్రంబుగ సమర్థించుట ఇందుకుఁ బ్రశస్తమైన నిదర్శనము మన భారతము, సంస్కృత మున నానాజనులు నానా విధములఁ దూర్చియున్న వెజ్జివెణ్ణి వేదాంతములు ధర్మాధర్మములు మొదలగు నసంబద్ధ చర్చలతో నిండి చూచువారికి దిక్కులు తెలియనట్లు విపులముగఁ బెరిగి చీCకు పొదవలె నుండు గ్రంథమును దెనుగున భగవద్గీతాద్యసంగత ప్రకరణములను సంగ్రహముగ వ్రాసి చదువరులకు నమందా నందము నిచ్చునట్లు పరివర్తించిన కవిత్రయము వారి రసజ్ఞతను అర్హ తకొలదిఁ బొగడ నెవరితరము ! ఇంకను సంకోచింపలేదేయని, విచారముఁ బూనదగుcగాని యింతచేసిరిగదా యని దూషింపఁ జూచుట బుద్ధిపొరపాటు.

                                             గద్య పద్య తారతమ్యముర

ఆధునికులలో నొక్కరు తెనుగు భారతము సంస్కృతమునకు సరియైన భాషాంతరీకధణముగాదనియు, నందు చే విషయగ్రహణ ముంగూర్చిన బాధలు కొన్ని వాటిలెననియు సెలవిచ్చుటయకాక, యది కారణంబుగఁ దాము నూతనాంద్రీకరణంబునకుం బూన వలసినవారై తమ విధిని కవిత్రయము వారి యౌదాసీన్యమును నిందించునట్లు దో చెడిని. ఉత్తమగ్రంథముల నెందఱెన్నీ రీతుల వ్రాసినను దగదని చెప్పగూడదు గాబోలు ! అయినను అట్టి వాదము లలో నించుక మతిభ్రమణ మున్నదేమో ! ఎట్లన : విషయము ప్రధానమైనది గద్యము. రసప్రధానము పద్యము. అట్లగుటఁ బ్రతిపదార్థానురూపంబగు రచన వచనమునం జెసిన నొప్పగుcగాని పద్య రూపముగ నొనరించిన వ్రాయు వారికి సుఖము లేదు. చదువువారి కంతకుమున్నే లేదు! ఇఁక కావ్యముగ దెనిగింప నెంచిరివో ! అపుడు సమయోచితములైన సంక్షేప విక్షేపముల జేగూర్చినఁగాని మనసు కరిగించునట్టి రుచియు భావోదేకంబులు గలుగనేరవు. ఈ న్యాయం బెఱుంగని శుష్క పండితులు పద్య రూపముగ భాషాంతరీకరణముం జేసిరయేని క్షేశంబు దక్క