పుట:Kavitvatatvavicharamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 194 కవిత్వతత్త్వ విచారము

                 హనుమంతుఁడు సీతాదేవిని వర్ణించుట
                     : సీ, కన్నీరు జడిగొని క్రమ్మఁ బ్రాకెక్కిన
                                                గవ్రుకపోల భాగములు గలిగి
                        యవశమై యొరఁగిన యంగవల్లిక పొంత
                                                     నున్న భూమీరుహ మ్మూతఁగాఁగ
                               వెడలు నిటూర్పుల వేఁడిమిఁ బగిలిన
                                                            యధర పల్లవము గారాకుఁబోల
                                     దలఁపల సందడి దందడించినదాల్మి
                                                                 కదలు శిరకంపగతుల బెరయ
                              నున్న పుణ్యమూర్తినుత్తమసౌందర్య 
                                నవనతాన్య నార్తయైనదాని.                 (ఆర. ఆ. 7, ప. 28)
                                 తిక్కన్న -
            విరాటపర్వములోఁ దిక్కన్న వ్రాసిన శృంగారవర్ణనము అనన్య సాధ్యమని వేఱుగఁ జెప్పవలయునా ? ఔచిత్యశోభితము. చెనటియగు కీచకు నట్టివాఁడు సైతము నిజంబగు ననురాగ ప్రభా వంబునం జేసి కళాపూర్ణాదుల కన్న మేలుగ ನಿಗ್ಗುತೆನಿ విధమునఁ గాక గఱువతనంబునఁ బలికెడు. నిక్కువమైన ప్రీతియున్న నే స్త్రీనింగూర్బియైన నసహ్యకరములగు వర్ణనల మృగప్రాయులు గాని వారెవరైనఁ జేయుదురా ? విరాటపర్వములోని యా పద్యము లన్నియు నుదహరించెద, లేకున్నఁ బక్షపాతమను నపవాదమే గాక, తిక్కన తెలిసి వ్రాసినాడో గ్రుడ్డియేటుగా వ్రాసినాడో యనియుఁ గొందఱు శంకింపనగు అన్నింటిని నివేదించిన నేశంకకు నవకాశముండదు.
                ద్రౌపదియొక్క సైరంద్రీవేషము :
                           సీ, పఱమొయిల్గప్పినఁ బాడ నునుఁగాంతి
                                               గదలిన యమృతాంశు కళయనంగఁ
                                బెనుమంచుమీఁద బర్విన వికాసము దప్పి
                                                   చెలువగుందిన సరోజిని విధమున
                             ధూమంబుపొదవినఁ దుఱఁగలి మెఱుఁగులు
                                                      నలఁగిమూసిన దీపకళిక పగిది
                             ధూళిపైఁ బొరసినఁ దొంగలించుట మాని
                                                    లావణ్యమెడలిన లతిక మాడ్కి