పుట:Kavitvatatvavicharamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 కవిత్వతత్త్వ విచారము

        శా.  పూతంబైన మదీయపుణ్యయుగమో పుణ్యంపుటిల్లాలనీ
             పాతివ్రత్యము చందమున్ విన మదిన్ భావింపఁగా నెట్టి దు
             ర్నీతి ప్రక్రియ వారికైనఁ గృపతో నీవిచ్చినంగల్గు నా
             పాతివ్రత్యము నాకుమీఁ దనయినం బ్రాపింప దీవింపవే !     ప. 178 
         క.  నావుడుఁ బరమ పతివ్రత
              వై వెలయుము రాజ్యవైభవానుభవం బెం
              తేవర్తిల్లఁగ నలరుచుఁ
              బ్రోవుఁడు మముబోంట్ల నీవిభుండును నీవన్.                       179
        ఉ.  అట్టిటుఁ జంచలింపకు దృఢాత్మత నుండుమటంచు నిప్పడే 
             మిట్టివి నీకు దెల్పునవి యెయ్యవి పెండ్లికిఁ బోవునట్లు గ
             న్పట్టుచు నున్న దాన వతిభవ్యవికాసమునుబ్బుఁ జూడ నిన్
             గ ట్టిగ నెన్న దేవతవుగాని నరాంగనవే మృగేక్షణా !                     180 
        చ.  అని తనుఁ బల్కునజ్జలరుహాక్షిని వీడ్కొని సిద్ధు వక్ర మున
             గనుగొని నన్ను నంపితిరె ఖడ్గము నిచ్చెదరే యటంచు నా 
             తని బలుకత్తిఁ బుచ్చుకొని తా మణికంధరు చేతికిచ్చి యో
             గ్యనియమ గంధమాల్యవతియై కలభాషిణి నిర్విశంకతోన్.              181 

   శక్తికి నభిముఖియై కూర్చుండెను. స్వహస్తముతోఁ గుత్తినిచ్చు మేల ? ప్రియునకు మనస్సంకోచము వాయుట కొఱకు సత్యమైన వలపునకు లక్షణ మే యిది. తమ కెన్ని వచ్చిన నేమి ? ప్రియులు సుఖంబున్నఁ జా లు : ఖడ్గ ప్రదానానంతరము అతని మనసు గట్టి పడునట్లుగా
       “క.  సమరంబున నెదిరించిన
             సమదాహిత వీరవరులఁ జక్కడఁచుటనై 
             జము మీకునిట్టి యెడలన్
             భ్రమయక చేమ అవకునికి పటు శౌర్యమునన్."                       184 
    అని తెలిపి కలభాషిణీదేవి యతనిచేత నిరస్త్రజీవయాయొ !
         ఈ పాత్రముం గూర్చి యింత విపులముగ వ్రాసినందుకు క్షమాపణార్థమై కారణములఁ జూపవలయు. సూరనార్యుని వాజ్మయ సృష్టి నెల్ల నియ్యది నిస్సంశయముగ నగ్రగణ్యము. దీనికిం దీటుగు చరిత్ర మింకెయ్యదియు මීඨ . శృంగార వర్ణనముం జేయుటలో ను ప్రబంధముల వెజ్జులేవియు వేయ లేదు. నల కూబరునికై నాలుగేండ్లకన్న నెక్కువగఁ గాచియుండెఁగదా ! ఇష్ట ముండినఁ జెలికత్తెలతో మొఱలిడుట, ఉద్యానవనములోఁ బడి