పుట:Kavitvatatvavicharamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుండుననుట స్పష్టము. అయినను, గుణము గుణము గాను దోషము దోషముగాను వర్ణించుట యుత్తమపద్ధతియనియు, గుణము మాత్రము ప్రకటించి దోషము గప్పిపుచ్చుట మధ్యమ పద్ధతి యునియు, దోషము మాత్రము విశదీకరించి గుణము మఱుఁగు పఱుచుట యుధమ పద్ధతి యునియు, గుణమును దోషము ఁగానో షము ను గుణముఁ గానో వెల్లడించుట యధమాధమ పద్ధతి యునియు లోకజ్ఞులు చెప్పదురు. కొంతకాలమునుండి, తెలుగులో విమర్శనము లేదను లోపము తీర్చుటకోయన పోఁకకు పుఁ డన్నట్లు వెడలుచున్న విమర్శనములలోఁ గొన్ని కడపటి మూఁడు పద్ధతుల కుదాహరణముగా నున్నవని ప్రాజ్ఞలోకము తలంచు చున్నది. విమర్శకుఁడు సహృదయుఁడు గానిచో భాష కిట్టి యనర్ధము లుప్పతిల్లునుగదా ! ఇందుకు c గొన్ని పత్రికలుగూడ సహకారు లగుచున్నవని చెప్పవలసి వచ్చుట విచారకరమగు చున్నది.

విస్పష్టముగా నిర్ణయింపవలసి యుండును గాని, అది సర్వథా సమ్మతమని స పమూ ఇము గా నిరూపించి యే కారణము న నో యాసము) తమని మర d విమర్శించినచో నట్టి విమర్శనము లెం 9 అప్డే యొుక భాషా విషయమును విమర్పించునపు డిది సంపదాయ విహితమని యొక మాఱును, ఇది సంప్రదాయ విరుద్ధమని యింకొకసారియుఁ జెప్పినచో నట్టి యభి ప్రాయముల కెండయిన విలువయుండునా ? విమర్శకుఁడు కొంత కాలమునకుఁ బూర్వాభిప్రాయము మార్చుకొనవచ్చునుగాని, &8 మార్పు సప్రమాణ మైనపుడే యుచితమగును గాని యస్థిరచిత్తతతో నసూయతోఁ గావించినదైనచో విద్వల్లోకము సమ్మతిగాంచcజాలదు. కావున నే దేని యొక విషయము విమర్శించుటకు ముందుగా నర్హత సంపాదింపవలెను. అది లేక విమర్శింపఁబూనుట యందని మ్రానిపండ్ల కఱచాచుటయే. కాని—

మొదటి యుత్తమపద్ధతి నవలం బించిన సద్విమర్శనములు గూడఁ గొన్ని యాంధ్రమున లేకపోలేదు. అందు శ్రీ రామలింగారెడ్డి గారి కళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శన మొకటి. భారతము, ఉత్తరహరివంశము, మనుచరిత్ర, ఆముక్తమాల్యద మొదలగు గ్రంథములను, నన్నయ తిక్కన శ్రీ నా థాది కవులను