పుట:Kavitvatatvavicharamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొందఱు గొన్నివిధముల విమర్శించిరి. కాని, వారి పద్ధతులకును రెడ్డిగారి పద్ధతికిని సూక్ష్మదృష్టితోఁ బరిశీలించినవారికి భేదము గోచరింపక పోదు. ఇది యాంగ్లపద్ధతి ననుసరించినదయినను, ఆంధ్రమున నవీనము స్వతంత్రము. ఎంతటి విమర్శనమైనను బునర్విమర్శనార్హ మగుచున్నదనుట యనుభవ సిద్ధ మగుటచే లో క్రో భిన్నరుచి యన్నట్లు కొందఱి విమర్శనములోని కొన్ని విషయము లందు భిన్నాభిప్రాయములు చూపుచున్నారని చెప్పవలసివచ్చినను, ఇంతమాత్రమున విమర్శనపద్ధతి కా క్షేపము రాఁజాలదు.

ఆంధ్రభారత నిరంతర పఠనాయత్తచిత్తులును విమర్శన విజ్ఞాన సంపన్నులు నగు శ్రీ రెడ్డిగారు పింగళి సూరనార్యుని కవిత్వ మందలి యూద రాతిశయమునఁ గళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యు మ్నములు పెక్కుసార్లు చదివి యతని కథా కల్పనా కవిత్వ చాతుర్యములకు మెచ్చి యందలి విశేషము లాంధ్రలోకమున కె బ్రీ Qగింపఁబూని ముcదుగా నుపోద్ఘాతముగా నాంధ్రకవితాస్వరూ పమును మొదటి ప్రకరణమున వర్ణించియున్నారు. స్వతంత్రకవుల పద్ధతులవలెనే స్వతంత్రవిమర్శకుల పోకడలును, అపూర్వములుగా నుండుననుట కుదాహరణముగా ఛిందు విశదీకరింపఁబడిన భావనొ శక్తి భావము పాత్రములు జీవకళ మొదలగు విశేష విషయములతో భారత కవుల ప్రతిభను, అందును విశేషించి తిక్కనార్యుని మహత్త్వమును గన్నులకుఁ గట్టినట్టు ప్రత్యక్షము గావించిన శ్రీ రెడ్డి তৃেত ও యాంధ్రాంగ్ల సాహిత్య విమర్శన విజ్ఞానమున కీ ప్రకరణ మూ కడము గా నున్నది. రెండవ ప్రకరణ మంతయు బ్రబంధలక్ష gడా ది విమర్శనముతో నిండినది. ఈ ఔండు ప్రకరణములలోని భావనాశక్తి వర్ణనాలంకార ప్రబంధకథాది విషయ విమర్శనము లందలి కొన్ని భావములును, కొన్ని వాక్యములును , ప్రాచ్య పాశ్చాత్యసాహిత్య వాసనా భేదములనుబట్టి వారివారికి వేఱు వేఱుగాఁ గనఁబడుటయు, ఆ విషయములను మఱి కొందఱు వేఱు గా విమర్శించి సమర్ధింపఁగలుగుటయు, సత్యమే కాని, శ్రీ రెడ్డిగా ణాశ్రయించిన ప్రధానోద్దేశము తోడి విమర్శనపద్ధతి కవి యిందు సరిపడుచునే యున్నవి.

ఈ గ్రంథమునకు జీవనప్రాయములై పరిమాణమందును గుణ మందును నుత్కృష్ణములైనవి తరువాతి రెండు ప్రకరణములు. ప్రభావతీ ప్రద్యుమ్న కథాసంవిధానమందును, మూఁడుమార్డు చదివినఁగాని యర్ధముగాక మిక్కిలి గజిబిజిగానున్న కళాపూర్ణోదయ కథానిర్మాణమందును గల యెల్ల మర్మములను సూరనార్యుని నిజ