పుట:Kavitvatatvavicharamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

160 కవిత్వతత్త్వ విచారము

యున్నారు. తఱుచుగ నుపమానములనైన వాడరు. వస్తువు సుందర ముగానున్న దానిని నిజరూపముతో సాక్షాత్కరించినట్లు వర్ణించిన

ప్రత్యక్షానందమీయ దా ? పోలిక లేల ? ఉత్పేక్ష లేల ? నురుగులు 

గ్రమ్ముచుండఁగా నలల పరంపరలచేఁ దీరము మీCద గొట్టు కాడు

సముద్రము తనంతట గంభీరముగాదా ? అద్దాని జూచినప్పడు మన
మానందించుట యుత్ పే క్షతో నా ? దానియందు చూపు హత్తి యిటు 

నటుఁ దిరుగకుండుట చేనా ? భారతములో నుపమానోత్పేక్షలతో (

గలసిన స్వభావ వర్ణనము లున్నవిగాని, యు వి స్వచ్ఛందముగ నప్ర 

యత్నపూర్వకముగ వచ్చినవి. సొగసుగ వనములగుండా దారిచేసి కొని పాఱు నదిని స్త్రీ కిం బోల్చుట సర్వదేశములలోను బ్రబలిన

యలంకారమగుట నైజమనవచ్చును. ಇಟ್ಟು చేయుటలోను నసాధు
వగు క్రియ యొకటున్నది. ఏదన, నదియందలి ప్రత్యవయవము
నకును స్త్రీ యువయవ మొండు సరిపోలినదని, యక్లే స్త్రీ యం
గాంగములకుఁ దోడుపోయిన భాగములు నది యందున్నవనిగాని 

చూపుట. ప్రత్యవయవ సమన్వయము చిత్రపుటూహ రసాన్వితము

కాదు. మొత్తపుటర్ధముగా సహజోపములు, ధ్వని మొదలగువానిచేఁ
గూర్పఁబడు సంబంధము మంచిది. ప్రత్యంగ క్రమమునకుం 

బోయిన C కుయుక్తులు దప్పవు. ఆకారము సమిష్టి నే భావము

ను ప్పతిల్లఁజేయునో, దాని నారసి, ప్రముఖములైన సాదృశ్యము
లున్నవానిని సూచించి విరమించుట బాగు. దీనిచేఁ జదువరులకును
లాభము. ఎట్లన, కవి చూపించిన పోCబడింబట్టి యింకను గొన్ని
సామ్యములను మన మే యేర్పఱచుకొనుటకు నవ కాశ ముండుటచే
బుద్ధికిఁ బనులును దానఁ జొఱవయుఁ గలుగును. ప్రతిపదటికగా 
బాకీ యే మాత్రము లేక యంతయు విశదపఱచిన మన మనః
పరిశ్రమకు వీలుండదు. కానఁ గొంతవడికి మాంద్యము విసుగును
జనించును. పూర్లోపముల కన్న లుఫ్టోపములు రసవత్తరములు.
భావానుకూల్యములు.
         ప్రాచీనులలోఁ గొందఱు కవులు (అందును ముఖ్యముగా
బమ్మెర పోతనామాత్యుఁడు) ఇంకొకవిధమైన యపభ్రంశము నాశ్ర
యించినట్లు తో cచెడిని. ఏదన, వనవర్ణనము మొదలగునవి చేయు
నపుడు పదాడంబరమునకై నిఘంటువులలోని చెట్ల పేర్లన్నియుఁ
బ్రయోగించుట దృష్టాంతము.
   " ఉ. ఆందుఁ దమాలమాలవకుళార్జుననింబ కదంబ పాటలీ
         చందన నారికేళ పునసార శిరీషలవంగలుంగ మా