పుట:Kavitvatatvavicharamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 151 యుండిన నా కాంతకు గౌరవము హెచ్చుఁగాని తగ్గియుండదు. నిండుమనస్సుతో [పేమించిన వాఁడెంత యనిష్టుడైనను, దనకింత మనోహరణ శక్తి యున్నదిగదాయని సంతోషమును, ఈ నిరాశ కి ప్లేల యితఁడు బలియగుచున్నాఁడని పశ్చాత్తాపమును ఏమాత్రముం జెందని కఠిన హృదయులగు స్త్రీలుందు రా ? యోజింపడు. ఇట్లు తన్నలయించుచుం బోవుచుండఁ దన ప్రతాపము ఆ పె కెఱుకపఱుచువాఁడై యా పెను దాఁక కుండునట్లు శలల ప్రయో గముఁ జేసి జంతుజాలంబుల సంహరి(చి యిట్లనియె : "నన్ను వరింపుము. లేనిచో నీవు చనెడు చోటులన్నియు నా బలముచేత నాశముచేయుదును. దాన నీకు నపకీర్తి కాన నాపయింగూర్చి కరుణ లేక యున్నను, భూతకోట్ల రక్షింపవలయునను దయచేనైన నాకుఁ బత్నివగుము' అయ్యో ! వానియూర్తి యెట్టిది ? తనకుఁ బరమార్ధము ఆ స్త్రీ. ఆమెను నొప్పింపడు. ఆమెపైఁ గినియcడు. ఇcక లోకమంతయు హింసి :చి, యూ హింస మాన్పుటకై యా పె యంగీకరించినను జాలుననుచున్నాఁడు. ఆహా ! కాఠిన్యము మార్ణవము రెండును వానియందున్నవి గదా ! మఱియు నీ కాఠిన్య మునకు మార్దవమే కారణము ! మోహమాహాత్మ్య మిట్టిది. వెన్న ఆూయగు ను . ఆూయి వెన్నయగును ! తన్నీరీతిని వెంబడించు నా యుసురను మణికంధరునిచేతఁ జంపించి, పిమ్మట నా మణికంధరుని రెండవ జన్మము వేచియుండి యు తఁడు గళాపూర్ణుఁడై జనింప తన పూర్వవృత్తంబు వివరించి గాంధర్వవిధిని వివాహమాడి యఖి నవ కౌముది, పట్టమహిషియై యుండెను. శల్యాసురుని తరువాత గతియే మా యనో తెలియదు. వానిది వ్యసనకరమును వ్యర్ధమునైన శుష్క జీవితము ! నిష్కళంక ప్రీతిచే విశోభితము. సుగా త్రిశాలీనుల విచిత్రకథ సుగాత్రి శారదపూజారియైన యొక బ్రాహ్మణునికూఁతురు, దాని వరుఁడు శాలీనుఁడు. ఇల్లటపుటల్లుఁడు. అలంకారములు, డంబములు, అట్టహాసములును వీనికి సరిపడవు. పల్లెటూరివాఁడు ಏುಣ వాసుల కుర్చీలు, మేజాలు, నిలువుటద్దములను జూచి వెఱఁగు వెఱపు నంది పోవు మాడ్కి, నేయలంకారములు లేక యుండు వారినే గాని, తళతళలు, పళపళలు, ఘలఘలలు, ఘుమఘుమలు మెరయవచ్చెడు స్త్రీలC దిలకింపఁడు. సర్వ