పుట:Kavitvatatvavicharamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 104 కవిత్వతత్త్వ విచారము

      ఉత్సాహ. అనుచు గగనభాగమునకు నంచ యొగయఁ జూచినన్
                  దనుజకన్య కాలలామ తనదు రెండుచేతులన్ 
                  వినయ మొప్పఁ బొదుగఁ బట్టి వేనవేలు భంగులన్
                  దనరఁ బ్రియము జెప్పచును ముదం బెలర్ప నిట్లనున్   
        సి.  నిద్దంపుఁబండువెన్నెలగాయు తెక్కల
                             యొప్ప చూడఁగ నొక్కయుత్సవంబు 
             మెఱుఁగుఁదీగెలబాగు మించు పక్షాంత హా
                              టకరేఖ లరయ నొందొక ప్రియంబుఁ 
             గమనీయ మగు మహాగమనగాంభీర్యాది
                              విలసనం బీక్షింప వేతెయింపు 
            మాధుర్యధుర్యకోమల వచనామృతం
                                 బనుభవింపఁగఁ గౌతు కాంతరంబుఁ
        తే. గలుగఁ జేయుచు నువ్విళ్ళు గొలుపునీదు 
            సంగతి యొకింత గని యెట్లు జారవిడుతు 
            నింక రాగవల్లరి పేరు నీవు నిజము 
            ననగ నీతో నొనర్తు నెయ్యంపుఁజెలిమి.
       అ.  ప్రణయ మొప్ప మిగులఁ బ్రార్ధించుచున్నట్టి
            నన్ననుగ్రహించి    నాదుచెలిమి 
             కొడఁబడంగవలయు నోహంసభామినీ
             యనుచు వేఁడుకొనఁగ నంచ పలికె.
       ఉ.  ఇప్పడు నీవు చెల్మికిని హేతువుగాఁగ గణించినట్టి నా
            యొప్పను గిప్పఁ దా నెచట నుండు రహస్యవిచారవిప్ను  మౌ
            టెప్పడు నీకుఁ దోఁచె నపు డింతయు రోసెదు దీనిచేత మీ 
            యిప్పటిమంతనంపుఁబని యేమఱ కంపుఁడు పోయివచ్చెదన్.
       వ.  అనిన విని రాగవల్లరి హంసీమతల్లికం జూచి యిట్లనియె.
       క.   పోయెదఁ బోయెద నం చి 
            బ్లోయంచలతల్లి యేల యుడ్డాడింపన్ 
            మా యే కాంతపుఁబనికిని
             నీయునికి విరోధిగాదు నిర్వాహకమున్.

వ. ఇదే నిమిత్తంబుగా సంఖ్యంబు గావలయునని ప్రార్థించెదము గాని కేవలంబైన తాపక రామణీయకంబుననకాదు. నీదుపలుకుం దెరువులు పరికింప నిది నీవును దెలియుట విస్పష్టంబ రైనను శుద్ధాంతస్థితి దోషంబునం