పుట:Kavitvatatvavicharamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



                          ప్రథమ భాగము                                  103


           చ.  అనుటయు రాగవల్లరి మహత్తర మోద విశేషసంభ్రమం 
                బునఁ బఆ9తెంచి యప్పలుఁగు ముద్దియ, దద్దయు ముదు గౌరవం 
                బును జిగురొత్త నెత్తుకొని పోయి ప్రభావతిదండఁ బెట్టి యొు 
                య్యనఁ గొనగోళ్ళ దత్తనురుహంబులు దువ్వచుఁ గూర్మి నిట్లనున్.

          ఉ.  అంచవు గావు నీవు నను నారసిప్రోవఁగ మూర్తిమత్వమం 
               గాంచిన భాగ్యదేవతవు గాని మదు క్తి తెఱంగు నేఁడు గె
              ల్పించితివే జగంబునను లేఁడిటువంటి మనోహరాంగకుం
             డంచుఁ గలంచు నిజ్జలరుహానన మానక నా దుచిత్తమున్.
          వ. అసిన విని ప్రభావతి నిజవయస్యం జనాచి.

          తే.  రాగవల్లరి నీ వేల వేగిరించె
               దింతమాత్రంబ చాలునే యీప్సితార్థ
               సిద్ధి కతనిలక్షణము లీచిత్రమూర్తి 
               యందు నేమైనఁ గల వేమొ యడుగవలయు.
          వ.  అనిన విని యాహంసి యాచిత్రరూపంబు నిరూపించి   ప్రభావతి ఉద్దేశించి    యిట్లనియె.

          ఉ. ఆరయ నింక నే మడిగె దల్లవె యాతఁడు శంబరుం ద్రిలో 
              కారిన ద్రుంచునప్పటి ప్రహారక్షిణంబు లురంబునందు నా
              హా రతికంక వాంకములు నల్లవిగో మెడయందు వీరశృం
              గారకళాఢ్యు నిట్లతని గట్టిగ నెవ్వ రేరెంగి    వ్రాసిరో.
         వ. ఈ లక్షణ కథనంబుచేత నతనినామజాత్యాదు లత్యంత సుపృసిద్ధంబులు   మీరు మీయంతనె యొరింగెదరు గావలయు నంతఃపురవాసినిలు గావున నెఱుంగరో యుని యొకింగించెద నంటినేని.
        చ.ఎనయఁగ నెవ్వ రెంతమన సిచ్చివచించిరి తాను వారితోఁ 
           బనుపడ నంతమాత్ర ప్రతిభాషణ మాడుట యుక్తమండ్రు మీ 
           కొనరఁగఁ బన్నిదంపు గెలుపోటలు దీర్పఁగ నిప్పడేను జె 
           ప్పినదియ చాలు నింకఁ దలపెట్టుట చెల్లద యెక్కుడేమియున్.
       తే. నీవ కద ప్రభావతి యన నిన్ను మున్న 
           తరుది నే వింటి, రాగవల్లరియో బోటి
           పేరు నీ విప్ప డన వింటి మీరిరువురు
           నీ యెఱుక మఱచెదరు నూ పోయివత్తు.