పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

40

కవికోకిల గ్రంథావళి


అనంతరము వెనుకకుఁ బరుగెత్తి తప్పించు కొందుము (ఇది కార్వము), అట్లుగాక మనము చూచినది నిరపాయకరమగు నీళ్ళపామని తెలిసికొన్న యెడల భయము శమించి యూరక నిలుచుందుము. ఇంద్రియ సందేశమును బుద్ది గ్రహింపలేని యెడల భావములు పుట్టవనియు వ్వతిరేకముగ గ్రహించిన యెడల వ్యతిరేక భావములే కలుగు ననియు నిందువలన మనము తెలిసికొనవచ్చును. వస్తువు లెట్లు అనుకూల ప్రతికూలములో వాని వలనఁ గలుగు భావములుగూడ నట్టివియె వస్తువుల సుఖదు ఖ భానజనకతా పరిమితికి సమముగ ఆకర్షణ వికర్షణములు పుట్టును.

ప్రతి వస్తువును జిత్తము నందొక భావమును రేఁపును. అట్టిభావములు అనుకూల్య ప్రాతికూల్యముల ననుసరించి సుఖ దాయకములుగనో క్లేశ దాయకములుగనో యుండును. సుఖ దుఃఖ తారతమ్యముల కనురూపముగ భావములు కొన్ని దుర్బలములుగను, మఱికొన్ని తీవ్రములుగ నుండును. భావములవలె రసములును అనంతములు. అయినను ఇందుఁ బ్రధాన రసములు తొమ్మిది, వానియొక్క సాంకర్య సాజాత్య భేద సంబంధముల వలన రసములు వివిధములగుచున్నవి.

ఒక్కొక భావము తనకనురూపమైన రసమును బుట్టింపఁ గలుగునెడల భరతాదులు భావత్రయ సంయోగము నేల బోధించి రని కొందఱు శంకింపవచ్చును. ప్రధాన రసములు పుట్టుటకు విభావానుభావ వ్యభిచారి సంయోగ మావశ్యకము, ఏలన, భిన్న ప్రకృతులందు నొ కేవిభావము