పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

25


7. వాక్యం రసాత్మకం కావ్యం. - విశ్వనాథుఁడు.

పై లాక్షణికులలో వామఁనుడు రీతియు, కుంతకాచార్యుఁడు వక్రోక్తియు, క్షేమేంద్రుఁడు ఔచిత్యమును, ఆనందవర్ధన విద్యానాథులు ధ్వనియు, మమ్మట విశ్వనాథులు రసమును, కావ్యజీవితమని నిర్వచించియున్నారు. కాని, వీని యన్నిటిలో నిశ్చితమైన ప్రమాణమేది? ఆలంకారికు లిట్లు భిన్నాభిప్రాయులైనపుడు సహృదయుల యంతరాత్మయె కడపటి ప్రమాణముగఁ దలంపవలయును. పై మతములను విమర్శించి చూడ లాక్షణికుల తీర్మానములు, [1]ఏనుఁగును జూచుటకై పొరుగూరికిపోయి వివాదములు పెంచుకొన్న గ్రుడ్డివారి రూపజ్ఞానముగ నున్నది.

రీతి, రసపోషణమున కనుకూలమైన వర్ణ సంఘటనము; కావునఁ గావ్యాంగమునకు సంబంధించినది. అంగము


  1. కొందఱు గ్రుడ్డివారు ఏసుఁగును చూచుటకై పొరుగూరికి పోయిరి. వారిలో మొదటివాఁడు తొండమును తాఁకి, ఏనుఁగు తనచేయివలె నున్నదనియు, రెండవవాఁడు కాలునుతాఁకి ఏనుఁగు స్తంభమువలె నున్నదనియు, మూడవవాఁడు పొట్టనుతాఁకి ఏనుఁగు గాదెబొట్టవలె నున్నదనియు, నాల్గవవాఁడు తోఁకనుతాకిఁ ఏనుఁగు కఱ్ఱవలె నున్నదనియుఁ దలంచి తమ యూరికి తిరిగి వచ్చుచు దారిలో తాము చూచిన విషయములను సరి పోల్చుకొనిరి. ప్రతివాఁడును సత్యమే చెప్పినను వారిజ్ఞానము పాక్షికమైనందున భేదాభిప్రాయములు గలిగి వివాదములు పెరిగి తిట్టుకొనసాఁగిరి. అంతలో ఏనుఁగును చూచిన మరియొకఁడు వచ్చి వారు చెప్పిన దంతయు నత్యమేయనియుఁ, బరిపూర్ణసత్యము తేలుటకు వారొకరొకరు తాకిన యంగములను గలిపి చూడవలయుననియుఁ దెల్పెను,