పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

కవికోకిల గ్రంథావళి

ములు అనుదినమును స్మరింపఁబడుచున్నవి. వారికావ్యములు నిరంతరము ప్రజల హృదయములపై ప్రభుత్వము చేయుచున్నవి. రామాయణము, మహాభారతము, భాగవతము, అభిజ్ఞానశాకుంతలము, ఉత్తర రామచరిత్రము, మేఘసందేశము మున్నగు కావ్యములును నాటకములును, షేక్స్‌పియరుమహాకవి రచియించిన నాటకములును (అందు ముఖ్యముగ విషాదాంతములు) స్వదేశములందేగాక పరదేశములందుగూడ సమ్మానింపఁబడుచున్నవి. ఎందువలన? అవి యుత్తమశిల్పలక్షణములకనన్యసాధారణ లక్ష్యములయి ప్రధానకావ్యప్రయోజన మగు సద్యఃపర నిర్వృతినిఁ గలిగించుచున్నవి. కావున నిట్టి యానంద ముప్పతిల్లఁ జేయు ప్రతికావ్యమును సజీవమని మనము తలఁపవలయును. కావ్యములను బ్రాణవంతములుగఁ జేయు చిచ్ఛక్తియేది? ఇందుకు సంస్కృతలాక్షణికు లేమి ప్రత్యుత్తర మిత్తురో దానిని మొదట దెలిసికొందము.

1. రీతిరాత్మా కావ్యస్య. -వామసుఁడు.
2. ప్రక్రోక్తిః కావ్యజీవితం. -కుంతకాచార్యుఁడు
3. అలంకారా స్త్యలంకారా గుణా ఏప గుణ! సదా ఔచిత్యం రససిద్ధస్య స్థిరం కావ్యన జీవితం. - క్షేమేంద్రుఁడు
4. కావ్యస్యాత్మా ధ్వనిరితి మీధైర్యః సమామ్నాతపూర్వంః - ఆనందవర్ధనాచార్యులు
5. శబ్దార్ధా మూర్తి రాఖ్యాతౌ జీవితం వ్యంగ్య వైభవం. - విద్యానాథుఁడు.
6. యే రనస్యాంగినీ ధర్మా! శౌర్యాదయ ఇవాత్మనః. -మమ్మటుఁడు.