పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/277

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

271


వలన మీరా నిరపరాధయనియుఁ దానే భ్రాంతి పడెననియుఁ దెలిసికొని చింతించెను. కష్టములు తలదాఁకినపుడు మనస్సులోఁ గొంత మాఱుపాటు సహజమేగాని, అవి మనః ప్రకృతిని మునుముట్ట మార్పఁజాలవు. మతము మాఱదు శైవుఁడు వైష్ణవుఁడు కాడు, వైష్ణవుఁడు శైవుఁడు కాడు, క్రైస్తవుఁడు మహమ్మదీయుఁడు కాఁడు, నాస్తికుఁడు ఆస్తికుఁడుకాడు. భ్రాంతిచే నిరపరాధను, బార్యను, చంపితినిగదా యను దుఃఖాగ్ని హృదయమును బరితపింపఁ జేయుచుండ మతభేదముల మంచి సెబ్బరలు తలపోయుట కేమి యవకాశము గలదు ఆ దశలో ?

(9) (b) రాణా మీరాను నిర్బంధమునందుంచినది...తన భార్య వీధుల వెంబడి పిచ్చిపట్టి తిరుగుచున్నదను అపవాదము నుండి కాఁచి కొనుటకును, కృష్ణమందిరముసకుఁ బోనీయకుండుటకును, మిగతదానికి సమాధానము (9) (a) లోనే కలదు.

(10) ఇది స్టేజిలో సరియైన దీపసౌకర్యములు లేనందున కలిగిన లోపము. నాటకమున నట్లులేదు.

(11) ధ్యాన నిర్మగ్న చిత్తులై యొడలెఱుంగనివారు ఎల్ల కాలమట్లే యుండరు; కొంతసేపటికి వారికి సామాన్య మనఃస్థితి గలుగును. రామకృష్ణ పరమహంసయు నిట్లె కొన్ని గంటలో ( లేక )యొకటి రెండు దినములో ధ్యాననిర్మగ్నుఁడై యుండి మరల సామాన్య మనఃస్థితిని పొందుచుండెను. ఇది సహజమే. యమునాతీరమునకు వచ్చుచుండినపుడు