పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

272

కవికోకిల గ్రంథావళి


మీరాబాయి సామాన్య మనఃస్థితియందే యుండెను. కావున నే అగ్బరు తాన్ సేనులతో సంభాషించెను.

(12) నాటకమునకు సంబంధింపని హల్లకల్లోలముతో రసలుబ్ధునకుఁ బనియున్నను ఇతరులకుండదు..___మీరాబాయి రాముఁడు కాదు. ఉదయపుర ప్రజలు అయోధ్యా ప్రజలు కారు.

(13) మేవాడ్ అనగా మధ్య దేశము. అది రసపుత్రుల రాజ్యము. చితోడ్ గడు పూర్వరాజధాని, తరువాత రాజధాని ఉదయపురమునకు మార్చఁబడినది. యమున మేవాడులో ప్రవహించుటలేదు. బనాస్ నది ఉదయపురముప్రక్క ప్రవహించుచున్నది. ఈ యుపనదియు యమునలో గలయును. ఈ నదికేమైన యమున యని మాఱుపేరున్న దో యేమొ తెలియదు...కథలో మాత్రము యమున యనియున్నది. కవియు ఆ యముననే గ్రహించి యుండునేమొ.

(14) సుశీల యెల్లపుడు దొంగలించు స్వభావము కలదియో కాదో చెప్పుటకు నాటకమున ఆధారములు లేవు. సుశీల తాను సొగసుకత్తెనను భ్రాంతికలది; తన్నలంకరించు కొనుట కా హారమును దొంగిలించియుండును. దానికి ఆ హారపు విలువ తెలియదు. సహజముగ దొంగ కాకపోయినను ఒక్కొక్కప్పుడు ఒకనికి దొంగలించుబుద్ది కలుగుట అసంభవముకాదు. ఈ ప్రశ్నలు నాటక విమర్శకుఁడు అడుగ వలసినవి కావు ఇట్టి ప్రశ్నలు పోలీసు స్టేషనులో ఉచితములుగా నుండును.