పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

కవికోకిల గ్రంథావళి


వలె వారసులకు లభించునదిగాదు. అది వ్యక్తుల చిత్తసంస్కారముల ననుసరించి భిన్నభిన్నముగ నుండును. మీరా పరమ భక్తురాలని ప్రజలు అమాత్యులు తలంచిరి. రాణా మాత్రము ‘‘మతావేశము కూడ నొక మానసిక వ్యాధి" యని తలంచెను, 'Modern Psychology' 'Abnorrmal Psychology' అను మనస్తత్త్వశాస్త్ర గ్రంథములఁ జదువుదుమేని రాణా నిశ్చయమునకు హేతువులు కలవని తెలియకపోదు-మన మతాభిప్రాయములకును రాణా అభిప్రాయములకును భేదము కలిగినంత మాత్రమున నాటకమును నిందింపఁదగదు --- నాటకమున నాయకుని, కవి యెట్లు చిత్రించెనని మాత్రమే విచారింపవలయును.

ఈ సందర్భమున T. G. Wainewright గారి యభిప్రాయ మెంతయు సమంజసముగ నున్నది: “I hold that no work of art can be tried otherwise than by laws deduced form itself; whether or not it be consistent with itself is the question."

మిరారాణాలకు రసలుబ్ధుఁడు కోరిన మతభేదమును గలదు. కాని ఆమత భేదమే ఈ నాటకమున ట్రాజెడీకి మూలకారణము కాదు. అది ట్రాజెడీ బీజములు; సులువుగా నంకురించి వృద్ధిచెందుటకు దగిన ద్వేషమును బుట్టించి అనుకూల పరిస్థితుల సంపాదించినది. ఏడెనిమిదేండ్లు సుఖజీవనముసలిపి అన్యోన్యము మనసు కలసియుండిన భార్యాభర్తల మధ్య 'ట్రాజెడీ' సంభవించిననే అది మఱింత ఘోరముగ నుండును. మీరా యందు సద్గుణములేకాక యామె చరమదశకుఁ గారణమైన గుణలోపములుకూడఁ గొన్ని కలవు. వాని ఫలిత