పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

255


సంఘమును సంస్కరింపఁబోయి రాజ్యభ్రష్టుఁడాయెను. ఇట్టి వీరి పతనమునందును గొప్పతనము గలదు!

రాణా మేవాడు రాజ్యాధిపతి యయ్యు సర్వసులభుఁడు. తలారి దర్శనము కోరినపుడు మంత్రులాటంక పెట్టినను “నా దర్శనముఁ గోరిన వారినెవ్వరిని ఆటంక పెట్టకుఁడు. నాకంతకంటె నుత్తమ కార్యమేమున్నది”, అని వారిని మందలించి తన విధిపర్యతమును స్ఫురింపఁజేసెను,

రాణా ధీరుఁడు: న్యాయైక పక్షపాతి. “నిజమెఱింగిన వెనుక నా కర్తవ్యమును అనుకూలముగ మఱచు నంతటి భీరువును గాను; స్వార్థపరుఁడను గాను. నా సంకల్పము న్యాయ్యము. నా న్యాయ్యసంకల్పము శాసనము. నా శాసనము పొల్లుపోక కొనసాగి తీఱవలయును” అను వీరుని దృఢ నిశ్చయమున గొప్పతనము లేదా?

రాణా అభిమాని. అభిమానము దాసునియందు అవగుణముగ నుండవచ్చును; రాజునందు అది గుణమె యగును.

రాణా ఉద్దతుఁడు. అవును. తప్పేమి! అగ్బరునంతటి వానిని యెదిరించి మొగలాయి ప్రభువులకు గుండెగాలమయి శిశోదియా వంశకీర్తి దిగంత విశ్రాంతము గావించిన కుంభరాణాయందు గర్వము ఆస్థానికముగాదు. ఉచితమే,

రాణా విషయలోలుఁడా? సంస్కృత నాటక ములలోని నాయకులతో సరిపోల్చి చూచిన, వారికంటె రాణా విషయలోలుఁడు కాఁడు; వారికంటె నెల్లవిధముల