పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/260

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

254

కవికోకిల గ్రంథావళి

రాణా పౌరుషవంతుఁడు : మొగలాయీలు హిందూ రాజ్యమును ధ్వంసముచేయ నుద్యుక్తులైనపుడు వారికిఁ బ్రతిస్పర్ధి గనిల్చి రసపుత్ర గౌరవమును నిల్పిన మహాయోధుఁడు ; మాన సింహాదులవంటి కొందఱు రసపుత్రులు అగ్బరునకు లోఁబడి చుట్టఱికములు కల్పించుకొని గులాములై యుండ తానొక్కఁడె యగ్బరును ధిక్కరించెను, పౌరుషమునందును వీరత్వమునందును గొప్పతనము లేదా ? రాణా అగ్బరునకుఁ బ్రబల ద్వేషి. అతని నామము నుచ్చరించుట గూడఁ దనరాజ్యమున అపరాధము. అగ్బరు హిందూమత పక్షపాతమను ఆచ్చాదనము మఱుగుసఁ దాఁగి మెల్ల మెల్లగ హిందూరాజ్యములఁ గబళించు చున్నాఁడు; ఆతని రాజనీతి అతలస్పర్శి అని రాణా యెఱుంగును. కావుననే అతనిపై రాణాకు ద్వేషము, ఇది క్షత్త్రియ సహజము, వారు సన్నాసులు కారుగదా!

రాణా సంస్కరణాభిలాషి: ప్రజల మనస్సులే కాదు పాలనాయంత్రముకూడ సంస్కరింపఁ బడవలయును అని తలంచెను. లౌకిక విజ్ఞానమును, జీవితమును ద్వేషింపఁ జేయు ప్రతిమతమును మానవుని మనోవికాసమునకు అంతరాయ మనియు, అట్టి సంకుచిత మతములను దన రాజ్యమున సమ్మార్జింప వలయుననియుఁ గుంభుని అభిప్రాయమును సంకల్పమునై యుండెను. కాని, కాలము ప్రతికూలము, పాపము! ఈ సంస్కర్తలు ఎప్పటికిని 'Tragic hero' పాత్రములుగానే పరిణమించుచుందురు, ఏసుక్రీస్తు మతమును సంస్కరింపఁ బోయి “సిలువ” పైఁ బ్రాణములు విడిచెను. అమానుల్లా