పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యంలో వైచిత్రి

221


తత్తరము, దృగ్గోచరములగు కేతన పటాంచలము, తురగ జవము, బండికండ్లు వీని సంబంధమువలన మూర్తిమంతములయినవి. రథమును దానిలోనున్న కృష్ణుని ఒక్క సారిగా మనము చూచుచున్నాము. కృష్ణుని మనస్థితితో పోల్చబడిన ఉపమానములును రథములోనివె. ఫిలిము డైరెక్టర్లు చూపించే Super in prised dissobes లాగా ఇది శోభించు చున్నది. దీనిలోని వస్తుసామగ్రి సర్వసామాన్యమైనదే. కాని వానికి కల్పింపబడిన పరస్పర సంబంధము కవి భావనా పటిష్టతను చాటుచున్నది.

Romantic కవులకు ప్రకృతి అనుసరణముకంటె భావసృష్టి అత్యంతప్రియము. పూర్వరచనలపై అసంతృప్తికలిగినప్పుడు నవ్యరచనకు దారి యేర్పడును. ప్రాణముకలిగిన వేవై నా ప్రతికూల పరిస్థితులు సంభవించినప్పుడు తిరుగబడును. కాలార తరుగ నేర్చిన బిడ్డ దాది నిర్బంధములకు ఎదురుతిరుగును. ప్రబంధరచనా విధానముపై కలిగిన అసంతృప్తియే యీనాటి కవుల క్రొత్తపోకడలకు హేతువైనది. - (ఆలిండియా రేడియో వారి సౌజన్యంతో.)

___________