పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

220

కవికోకిల గ్రంథావళి


పట్ల సత్యమే యని యనవలయును. ప్రతి పదరసోదయముగా కవిత్వము చెప్పిన తెలుగు కవులలో చేమకూరు వెంకన్న ముఖ్యుడు. ఆయన మార్గం నిజంగా యెవరికీ అబ్బ లేదు. మహాకవుల పోకడలు సాధ్యములుగావు.

చిత్తజుడల్లి తూపుమొన చేసినఁ జేయగనిమ్ము పై ధ్వజం
బెత్తిన నెత్తనిమ్ము వచియించెదఁ గల్గినమాట గట్టిగా
ఆత్తరళాయతేక్షణకటాక్ష విలానరస ప్రవాహముల్
కుత్తుకబంటి తామరలకున్ దలమున్కలు గండుమీలకున్.

ఈ పద్యము

ప్రతీయమానం పునరస్యదేవ
వన్త్వస్తిపాణిఘ మహాకవీనాం
యత్తత్ ప్రసిద్ధాది యవాతిరీక్తం
విభాతి లావణ్యమివాంగనాసు.

అను లక్షణమునకు ఉదాహరణ ప్రాయముగనున్నది. అంగనలయందు అవయవాతిరిక్తమైన లావణ్యమువలె మహాకవుల వాక్యములందు నిఘంటు అర్థములకు మించిపోవు భావస్ఫురణలు ఉన్నవనుట నిజమె.

సత్యభామకడకు కృష్ణుడు రావడము పారిజాతాప హరణములో తిమ్మన ఈ విధంగా వర్ణించినాడు.

అడదమునెక్కి కేతన పటాంచల చండలమైన తాల్మితో
దురగజవంబు మున్గడవద్రోచి కడంగెడు తత్తరంబుతో
దిరిగెడు బండికండ్లపగిదిన్ భ్రమియించుమనంబుతోడ నా
హరి ననుదెంచె సత్యసముదంచిత కాంచనసౌధవీధికిన్.

ఈ పద్యమున కృష్ణుని యాతురత మనఃస్థితి అద్భుతముగ వర్ణింపబడినది. కంటికి గోచరింపని తాలిమి, మనస్సు,