పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

కవికోకిల గ్రంథావళి

పై గ్రంథమాలయొక్క సూత్రవిభాగము 123-వ ఖండమందు నాలుగు శిల్ప శాస్త్రములు గలవు. అవి యేవన:

(1) దశతలన్య గ్రోధపరిమండల బుద్ధ ప్రతిమా లక్షణము.

(2) సంబుద్ధ బాషిత ప్రతిమాలక్షణ వివరణము.

(3) చిత్రలక్షణము.

(4) ప్రతిమా మానలక్షణము,

మరల చిత్రలక్షణము మూడధ్యాయములుగ విభజింపఁబడి యున్నది. కడపటి యధ్యాయమునఁ బలు తెఱుఁగులైన కొలతలను గుఱించియు గ్రంథకారుఁడు వివరించి యున్నాడు. ముప్పదియారు విధముల నయనభంగుల వర్ణన మందుఁ గలదు. ఆ యధ్యాయమందె చిత్రశిల్ప పద్ధతిని గుఱించియుఁ జెప్పఁబడియున్నది. ప్రథమాధ్యాయమందుఁ జిత్రవిద్యయొక్క యుఁ జిత్రలక్షణమను గ్రంథముయొక్కయు నుత్పత్తి వర్ణింపఁబడినది. ద్వితీయాధ్యాయమునందుఁ జిత్ర విద్యయొక్క దైవిక సంబంధపుగాథ వ్రాయఁబడినది. మొదటి రెండధ్యాయముల చివర "నగ్నజిత్ కృత చిత్ర లక్షణము” అని గ్రంథ రచయితపేరు తెల్పఁబడియున్నది.

మొట్టమొదట భూలోకమునఁ జిత్రవిద్యను సృజించినది నగ్నజిత్తు అను నొక రాజు. పూర్వకాలమున, యశస్వియు, ధార్మికుఁడునయి భయజిత్తు అను రాజొకడుండెను. ఒకప్పుడొక బ్రాహ్మణుఁ డాతని యొద్దకువచ్చి “నాపుత్రకుఁ