పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

123


యంత్రము, రాముఁడు స్వప్రయోజనమును సాధించుటకొఱకు అక్రమముగ వాలిని సంహరించెను, వాల్మీకి యీ విషయము నెఱుంగును; ఆక్రోశ నినాదముచే దిక్కులు మాఱుమ్రోగించుచున్న తారపై ఆ మహాకవికి మిక్కుటమైన సహానుభూతికలిగి, రాముఁడు జహబు చెప్పుటకువీలు లేని ప్రశ్నలను ఆమెచేతను వాలిచేతను సడిగించెను. తరువాత రాముని ధర్మైక పరత్వమునకు హానికలుగునని శంకించి తాను వత్తాసివచ్చి రాముఁడు దేవుఁడు గావున ఆయన చేసినదంతయు ధర్మమనిచెప్పి పై పెచ్చు వాలిచేత గూడ నొప్పించెను? వ్యాసుఁడు పాండవ పక్షపాతి; వారు ఇడుమలు పడిరన్న కనికరముచే వారి తప్పులకు సున్నపు పూఁతలుకొట్టి మాలిన్యమును మాయించెను. తమ సృష్టులను తామే మోహించిన వారు కూడ కలరు ? వీరిలో పైగ్మ్యాలియన్" అను గ్రీకు శిల్పి ముఖ్యుఁడు. ఆతఁడొకరమణీయవతియగు స్త్రీ విగ్రహమును చలువఱాతితో నిర్మించి ఆ సౌందర్యమునకు ముగ్ధుడయి మోహించి తన పడకటింటఁ బెట్టుకొనెనఁట!

ప్రవరుఁడు నీతిశాస్త్రమునందు నిర్ణయింపఁబడిన కొలతలకు సరిపోవునట్లు కత్తిరింపఁబడిన తోలుబొమ్మ. వరూధిని విద్యుల్లతవలె మనకన్నుల యెదుట సంచరించు జీవన్మూర్తి! బయాస్కోప్ చిత్రము. వరూధిని చైతన్యము పరిస్ఫుటముగ గోచరించుటకు ప్రవరుఁడు సృజింపఁబడెను. కవికి అతనిపై సానుభూతి లేదు. “బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా' శ్రోత్రియుల్ ! " అని ప్రవరుఁడు తన లోకజ్ఞాన