పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కవికోకిల గ్రంథావళి


శూన్యతను అత్మదూషణప్రాయముగ ఒప్పుకొనెను. ఈ వాక్యము వేఱుసందర్భమునఁ జెప్పఁబడినప్పటికిని ఆతని శీలమును ఆ వాక్యార్థము నిరంతర మాపాదించియే యుండును. పాదలేపము కరిఁగిపోయిన యనంతరము తన నిస్సహాయతను గుఱించి దుఃఖంచునప్పుడు మన కథానాయకుని సంగతులు మఱికొన్ని బయలుపడును. తల్లిదండ్రులకుఁ దా నొక్కఁడె యల్లారు ముద్దుబిడ్డ. పెండ్లి యయి శిష్యులకుఁ బాఠము చెప్పు వయస్సు వచ్చినప్పటికిని, తన్నుఁజూడనిదె తండ్రి యొక నిమిషమైన యోర్చుకొని యుండ లేఁడు. అసర సందెవేళ ఈ బిడ్డ బయట కాలుపెట్టిన యెడల బూచులు పట్టుకొను నను శంకచే వాకిలి దాటనీయక తల్లి యెల్లప్పుడు రక్షించుచుండును. ప్రవరుఁడు తల్లిదండ్రుల ప్రేమాతి శయముచేతను అనావశ్యకమగునంత జాగ్రత్త చేతను, నిస్సహాయుఁడుగను లోకజ్ఞాన రహితుఁడుగను జేయఁబడిన అమాయకుఁడు. వరూధిని చెలికత్తె యాతఁడు “గోలయున్ బాలుఁడు” అని కనిపెట్టినది ,

ప్రవరుఁడు మృగమదసౌరభము మోసికొనివచ్చు మందమారుతము వలన అచ్చోటు జనాన్వితమని తెలిసికొని చేరఁబోయి యొక దేవకన్యను గాంచెను. ఆమెయె వరూధిని. ఆ యువతి యసమాన రూపలావణ్యవతి; సౌందర్యమునుగాంచి యానందించుటయు దానిని మెచ్చుకొనుటయు అనీతికరము గాదు కాని, మన నీతిమంతుని చిత్తము సౌందర్య ప్రతిరోధకమైన కవచమునందు మగ్గిపోయినది; పాషా