పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లసాని పెద్దన

121


పరాయణత్వమును రెండవ దానియందు మానుషత్వమును గలవు. కవి యీ రెండు ప్రకృతులను సృజించి శీలపోషణమునందుఁ దారతమ్యము జూపించి యొక దాని కొకటి భిత్తిగ నొనరించెను.

ఆంధ్రదేశమునందు భిన్న మతములు ప్రబలుటవలన వైదిక మతమునందును వర్ణాశ్రమధర్మములందును బ్రజలకుఁ గొంత అశ్రద్ధ జనించినది. మాధవ శాయణులు వేద భాష్యమును రచించియు రాజకీయ విషయములందుఁ బాల్గొనియు వైదికమతమును గొంతవఱకుఁ బునరుద్దరించిరి. కాని, కాలక్రమమున ఆ యుద్యమముగూడ సన్నగిల్లినది. దేశపరిస్థితులు సౌమ్యముగా లేవు ; మాటిమాటికి యుద్ధములు, కొల్లలు, సర్వజన సామాన్య కష్టములు కలుగుచున్న సమయములందు నీతులు ఆచారములు వర్ణాశ్రమ ధర్మములు నిర్వర్తింపఁబడుటకు వీలులేదు. యుద్ధకాలము లందు వర్ణ సాంకర్యము సామాన్యము..

ఒక జాతిగాని సంఘముగాని బలశౌర్యములు గలిగి పరాక్రమవంతమై యితర జాతులపై దండయాత్రలు వెడలి జయము గాంచినప్పుడు ఆవిజయఫలము ననుభవించుచు వారు భోగపరాయణులయ్యెదరు. వైరాగ్యము మంచునకైన లభింపదు. గృహస్థ జీవితమె ఆదరణీయమగును. మతము అభ్యాస వశమున అర్ధములేని యాచారముగ మాఱియుండు నేగాని, దైనందిన జీవితమునందు దాని యూపశ్యకత అంతముఖ్యముగ దోఁపదు. కృష్ణదేవరాయల రాజ్యకాలమునందొకప్పు డిట్టి పరిస్థితులు సమకూడినవి. పెద్దన హృదయమును వంశపారం