పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

120

కవికోకిల గ్రంథావళి


బద్వేలియందొక సరస్సుగలదు. పెద్దన వేఁటకువచ్చినప్పుడా సరస్సులో స్నానము చేయుచుండెనని యచ్చట ప్రజలు చెప్పుకొనుచుందురఁట.

“ఆందకవితా పితామహుఁడ”ని కృష్ణదేవరాయలు పెద్దనను సంబోధించుట కేవలము ప్రీతి మూలకమనియుఁ, దక్కినవారి రచనలకన్న అందు ముఖ్యముగా నందితిమ్మన కవిత్వమునకన్న పెద్దన కవిత్వమేమంత రసవంత మనియుఁ గొందఱు వితర్కింతురు. అది కేవలము ప్రీతిమూలక సంబోధనముగాదు. పెద్దన కవిత్వమునందు సౌకుమార్యము, తెనుఁగుమాటల తియ్యందనము, తేలిక మాటలలో నియమింపఁబడిన భావగాంభీర్యము, ప్రకృతి రామణీయక ప్రీతియు, నవ్యతయుఁ గలవు, పెద్దన పబంధపు నమూనాను సృజించిన వాఁడు కాకపోయినను, ఆంధ్రీకరణము గాక స్వతంత్ర కధావస్తువును గ్రహించి కావ్యము రచించి నూతన సంప్రదాయ మేర్పఱచెను. శ్రీనాధుని నైషధము ఆంధ్రికరణమయ్యును స్వతంత్ర ప్రబంధమువలె నొప్పారుచు పెద్దనకు మార్గము సిద్ధపఱచెను.

ఇతివృత్తము మార్కండేయ పురాణము నుండి గ్రహింపఁబడినది. తన మనమును ఆందోళనపఱచుచున్న భావయుద్ధమును ద్వైధీభావమును ప్రతిఫలింపఁ జేయుట కనువైన కథనే కవి యేర్పఱచుకొనెను. మూర్తీభవించిన రెండు ఆదర్శకములు మన కన్నులయెదుటఁ బొడకట్టు చున్నవి. ఒకటి: హృదయములేని నైతిక కర్కశత్వము; రెండు: భోగలాలసత్వము. మొదటిదానియందు ఆచార