పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

5


తరువాత, అభినవమార్గ మవలంభించిన ఆ యుద్గ్రంథముతో పోటీకి నిలువ లేక యెట్లునశించెనో, అట్లే రామాయణమునకుఁ బూర్వమున్న చిన్న చిన్న కావ్యములు, గేయములు ఈ బృహత్ప్రబంధముధాటికి నిలువ లేక యత్మహత్య గావించుకొని యుండును. రామాయణమునందు వర్ణింపఁబడిన నాగరకతను గమనించినయెడ ఆకాలమున కవిత్యశిల్పము కొదువపడి యుండెనని చెప్పుట కెవ్వరును సాహసింపరు. సత్యము. భూతకాలగర్భమున దాఁగియున్నది. వాల్మీకి ఆదికవియైనను కాక పోయినను, రామాయణ మాదికావ్వమైనను కాకపోయినను సీతారాములు చారిత్రక నాయికానాయకులైనను లేక , వాల్మీకి మహాకవి యగాధ భావసాగారము మధింపగా బైకుబికిన యమృత నవనీత రాసులైనను మనకొక్కటియె ! ఇందలి సత్యా సత్యములు చరిత్రకారులకు వదలిపెట్టెదము. వారికి సాధ్యము గాని రసాస్వాదనమునకు మనము పూనుకొందము. రామాయణము శాశ్వతకల్పనయైనది ! దాని యధికార మనంతము! సర్వకాలీనము !

కవిత్వము ప్రత్యేకముగ నొక దేశమునకును, ఒక జూతికిని, ఒక నాగరకతకును సంబంధించియుండునదిగాదు. అది విశ్వజనీనమైనది. మొట్టమొదట మానవ హృదయమెప్పుడు రసార్ద్రమాయెనో, అప్పుడే కవితాబీజ మంకురించెను. అప్పుడే మానవుని కల్పనాశక్తియు ప్రతిభయు బయలయ్యెను. అప్పటి నుండియు కవితామహాలత శాఖోపశాఖలుగఁ జీలి మానవ సంఘమునం దల్లుకొనుచున్నది. మానవజాతి యజ్ఞాన నిమగ్నమై బాల్యదశయందున్నప్పుడు, రామాయణము. మహా