పుట:Kavijeevithamulu.pdf/711

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

703

శాసనములం బట్టియు, నాతనిమంత్రి దండనాథులకాలముం బట్టియు నీ గణపతిదేవుఁడు శా. స. 1053 మొదలు 1130 వఱకు నున్నట్లు తేల్చితిమి, ఆవివరమంతయు నీవఱకే కాకతీయుల వంశచారిత్రములో వివరింపఁబడినది. గావున నిచ్చో దాని న్వి స్తరింపను. అట్టిగణపతిదేవుని మంత్రి యగునీనన్నయకాలము నావిధముగనే నిర్ణయింతము. అతని నుండి అయిదవపురుషుఁ డీకృతిపతి యగుకందన మంత్రి. ఇతనికాలము మనము పురుషునకు ముప్పది సంవత్సరములవంతున లెక్కింపగా నైదుగురుపురుషులకును నూటయేఁబదిసంవత్సరములు చేర్చవలసియుండును. అనఁగా సుమారు 1050 + 150 = 1200 శా. స. మగు నటనుండి నూఱుసంవత్సరములవఱకుఁ జూచిన శా. స. 1300 లకు లోపలనే కందనమంత్రికాల మగు.

ఇఁక నితనిపైఁగృతినిచ్చిన సింగనకవికాల మించుమించుగా నదియ యగు నగుటకు సంశయము లేదు. పైగణపతిరాజు కాలీనుఁ డగుతిక్కన సోమయాజితో నీకవి కొంతదూరపు సంబంధి యగుటంజేసి అక్కడినుండియు లెక్కించి చెప్పవచ్చును. కాకతీయుల చారిత్రముంబట్టి తిక్కనసోమయాజి గణపతిరాజు పెద్దతండ్రి యగురుద్రరాజుకాలము వాఁడుగాఁ దేలినది. ఆరుద్రరాజు శా. స. 972 మొదలు శా. స. 1050 వఱకు నున్నట్లు కానుపించుచున్నది. తిక్కనసోమయాజి శా. స. 1020 మొద లున్నట్లు చెప్పుటకు సందియ ముండదు. ఇతనిమరణము లోకల్‌రికార్డులలో నున్నట్లు శా. స. 1120 అగునెడల నీతఁడు నూఱుసంవత్సరములు జీవించియుండును ప్రస్తుతములో మన కింతకంటె నీతనినిర్యాణ కాలముం దెలుపుగ్రంథాధారములు లేవు గావున నీతనిమరణకాల మిదిగానే భావించి యితని నుండి యీసింగనకవికాలము నిర్ణయింతము. ఇతఁడు తిక్కనసోమయాజి పౌత్త్రునిపుత్త్రిక(లేకపుత్త్రునిపుత్త్రికకు) మనుమఁ డని చెప్ప బడెఁ గావునఁ దిక్కనసోమయాజినుండి యితఁ డేడవపురుషుఁడు గావచ్చును. ఆపక్షములోఁ గడమ ఆర్వురుపురుషులకును (1) కి ముప్పది సంవత్సరముల చొప్పునఁ 180 బదిసంవత్సరము లగును. అనఁగా 1120 + 180 = 1300