పుట:Kavijeevithamulu.pdf/710

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది
702
కవి జీవితములు.

డును, నీతిచాతుర్యవివేక విశేష గుణాలంకారుండును నై యమ్మహారాజుమన్నన వడసి విశేషవస్తు వాహన ఛత్ర చామ రాందోళికాది రాజచిహ్నంబులం బెంపొందు కందనా మాత్యవంశావతారం బెట్టిదనిని"

వాణసవంశము. కాశ్యపగోత్రము.

రుద్రమంత్రి (మొలగూరుగ్రామాధిపతి)

|


ఇట్లుగా నీవంశావళిలో వివరింపఁబడిన పురుషులలోని. 1. 2. 3. గుర్తులు గలవారి చారిత్రముం దెలుపుపద్యముల నీక్రింద వివరించెదను. అందు

1. నన్నయమంత్రివిశేషములు.

"చ. పరువడి కాకతీయగణపక్షితినాయకునొద్ద మాన్యుఁ డై
      ధరణిఁ బ్రశస్తుఁ డై నెగడె దానము లెల్లను జేసి పేరు పెం
      పెరువుగ గుళ్లు గట్టి గణపేశ్వరదేవుని గొపికాధిపున్
      దిర మగుచున్నలక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ ప్రభుత్వ మేర్పడన్."

దీనింబట్టి యీనన్నయమంత్రికాలము కాకతీయగజపతిదేవుని కాలముగాఁ దేలినది. ఇదివఱలో మనకుఁ గాన్పించుచున్న గణపతిదేవుని