పుట:Kavijeevithamulu.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

699

కణంబు లనియును, దేహం బనిత్యంబు, దేహి నిత్యుం డనియును, జీవుండు చిత్తం బనియును, చిత్తంబునంద జగత్తులు విస్తరిల్లు ననియును, తత్సంకల్పంబ బంధంబు, తన్నిరసనంబ మోక్షంబనియును, చిత్తశాంతియ జీవన్ముక్తి యనియును, బెక్కువిధంబు లుపన్యసించు నట్టి వాసిష్ఠసంగ్రహం బాంధ్రభాష నఖిలలోకోపకారార్థంబుగా రచియించెద."

కవివిజ్ఞాపనము.

"క. ఇది తత్త్వరహస్యార్థము, పదసంగతిఁ దెనుఁగుపఱుప బ్రాజ్ఞులకును బె
     ట్టిద మగుఁ దత్పరవాసన, విదితంబుగఁ గవులు మెచ్చ విరచింతుఁ దగన్.

క. విజ్ఞానులు మును జెప్పిన, సంజ్ఞాభ్యాసములు కొంత జాడలు దోఁపన్
    విజ్ఞాపనంబు జేసెద, ప్రాజ్ఞులు తార్కికులు తప్పుపట్టకుఁ డెలమిన్.

క. కరు కిది నీరస మని వే, సర కల్లన వినుఁడు తుద రసాయన మగుఁ దాఁ
    జెఱకు తుదనుండినమలిన, తెరగున మది కింపు దనుపుఁ దీపున్ జూపున్.

క. మృదుమధురవచనగర్భము, గదియించినయట్ల తత్త్వగాఢార్థము చె
    ప్పుదుఁ బువ్వుదేనెఁ గొనుతు, మ్మెద మ్రాఁకులు దొల్చు నేర్పు మెఱసినభంగిన్.

క. ఇది యల్పగ్రంథం బని, మదిఁ దలపకుఁ డఖిలశాస్త్రమతములు దీనన్
    విదితం బగు నద్దములో, మదదంతావళము దోఁచుమాడ్కిని దెలుపున్."

కృతిపతివిషయము.

తనతొల్లింటిగ్రంథములవలెఁగాక నీగ్రంథమహోబలనృసింహ స్వామివారికి సింగనకవివలనఁ గృతియియ్యఁబడినది. దానికిఁ గారణాదికము నీక్రిందిరీతిని వివరించె. ఎట్లన్న -

"వ. అని సకలజనసమ్మతముగా నుపక్రమించి యనన్యసామాన్య యగునిక్కవి తావధూమణికిఁ బురుషుండు పురాణపురుషుండు గావుతమని, యఖిలలోకాధీశ్వరుండును, అతులకళ్యాణగుణాలంకారుండును, ననవరత లక్ష్మీ సమేతుండును, నాదిమధ్యాంత రహితుండును, నభిమతఫలప్రదాయకుండును, నగు నహోబల శ్రీనృసింహదేవునకు నిచ్చెద నని తలంచి, యద్దేవుం డఖిలవేదాంతవాగ్గోచరుం, డతితుచ్ఛంబు లగుమద్వాక్యంబు లర్పింతుననుటయు మహాద్రోహం బగునో యని శంకించి, యప్పరమేశ్వరుం డాశ్రితసులభుండగుటయు, మత్కవిత్వంబు తదీయవరప్రసాదలబ్ధం బగుటయు భావించి మనంబున నిట్లు వితర్కించితి.

క. వనరాశి జలము గొని యా, వనరాశికి నర్ఘ్యమిచ్చువడువున హరియి
    చ్చినవాక్యము లే నతనికి, ననయముఁ గృతిసెప్పి సుకృతి నగుదు ధరిత్రిన్.

క. గురుఁడునుదల్లియుఁదండ్రియుఁ, బురుషుఁడు, విద్యయును, దైవమును దాతయునా
    బొరి నేడుగడయు దానై, హరి నను రక్షించుఁగాత ననవరతంబున్.