పుట:Kavijeevithamulu.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

697

యని వ్రాసిరి. దానికిఁ దగినయుక్తులు కాన్పించుటలేదు. పైనమనము వివరించిన అల్లాడమంత్రికాఁపురస్థలము కోటసీమ (ధరణికోటిసీమ కానోవు) లో గృష్ణానదికి దక్షిణమున రావెల యనుయగ్రహారము. దాని నతఁ డేకభోగముగా ననుభవించుటంజేసి అతని నొకగుర్తుంచి తెలుపుటకుగాను రావెల యల్లాడమంత్రి యని చెప్పవచ్చునుఁ ఇక కవియొక్కతండ్రి యగునయ్యల మంత్రి రాజమహేంద్రవరమును పాలించుచున్న తొయ్యేటియనపోతభూపాలుని మంత్రియగుటంజేసి అతనిని రాజమహేంద్రవరపు అయ్యలమంత్రియని చెప్పనొప్పియుండు. ఈ అయ్యలమంత్రి (2) గుర్తుతో నీక్రింద నుదహరించఁబడు పద్యానుసారముగా గోదావరీనదికుత్తరతీరమునందలి పెద్దమణికి యను గ్రామమందున నారామక్షేత్రములను సంపాదించె నని యుండుటంజేసి అతనిని పెద్దమణికి యయ్యలామాత్యుఁ డని చెప్పినఁ జెప్పవచ్చును. ఇఁక కవియగు సింగన తాను తన ప్రభుం డగుకుమారముప్ప భూపాలునివలన రామాద్రిసీమలో ననేకవృత్తులు గ్రామములను బడిసితి నని చెప్పుకొనెను. ఆకారణమున నతనియింటిపేరు రామాద్రిసీమ వా రనిగాని లేకున్న నతఁడు గై కొనిన గ్రామములలో నొక గ్రామ నామము గాని అతనికి నింటిపేరుగాఁజెల్లిన లెస్సయై యుండును. ఇవియెవ్వియుఁగాక నీకవియింటిపేరు మడికివారని నిష్కర్షించుటకుఁ బంతులవారికిఁ గలయాధారములు మాత్రము నాకుఁ గానరాకున్నవి. ఈవృత్తాంత మేమైన నీకవివలన రచియింపఁబడినపద్మపురాణోత్తరఖండములో నున్న దేమో ముం దరయుదముగాక.

అయ్యలుమంత్రివర్ణన.

ప్రస్తుతములో నీకవితండ్రి యగునయ్యలమంత్రివర్ణ నముగల (2) గుర్తు గలపద్యము నిట వివరించెదము అదెట్లన్నను :_

"సీ. ఆత్రేయగోత్రపవిత్రు పేరయమంత్రి, పుత్త్రి సింగాంబిక పుణ్యసాధ్వి,
      వెలయ వివాహమైవేఁగిదేశంబులో, నేపారురాజమహేంద్రపురికి,
      నధిపతి తొయ్యేటి యనపోతభూపాలు, మంత్రి యై రాజ్య సంపదలఁ బొదలి
      యొప్పారుగౌతమియుత్తరతటమున, మహనీయ మగు పెద్దమణికియందు