పుట:Kavijeevithamulu.pdf/704

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

696

కవి జీవితములు.

పై వివరించినవారిలోఁ 1, 2. గుర్తులు గలవారి చారిత్రములు కొంచెము వివరింపవలసియున్నది. అందులో 1 గుర్తు గలయల్లాడమంత్రి విషయమై చెప్పంబడినపద్య మీవఱకే వివరించినాఁడను. దానిలో నాతఁడు తిక్కన సోమయాజుల పౌత్త్రుఁ డైనగుంటూరి కొమ్మనప్రభుని పుత్త్రి యగుబిట్టాంబ యనుచిన్నదానిం బరిణయంబైనట్లున్నది.

తిక్కనసోమయాజి యింటిపేరు.

తిక్కనసోమయాజితాత యగుభాస్కరమంత్రి గుంటూరివిభుఁడని వ్రాయంబడుటచేత నతనికి గుంటూరిభాస్కరుఁ డనియే నామము కల్గినట్లు కాన్పించు. ఇతని కుమారుఁడును తిక్క సోమయాజులతండ్రియు నగు కొమ్మన దండనాథునకును గుంటూరివిభుఁ డనియుండుటచేత నతనికి నింటిపేరు గుంటూరి వారనియే తేలినది. ఇప్పుడు తిక్కనసోమయాజి పౌత్త్రునకుఁగూడ గుంటూరి కొమ్మవిభుఁ డనియుండుటబట్టి అతనికి నదియే యింటిపేరుగాఁ దేలినది. ఇట్లుగాఁ దిక్కన పై వారికినిఁ దఱువాతవారికిం గూడ గుంటూరివా రనుగృహనామము కల్గినపుడు తిక్కనయింటిపేరు గూడ నదియే యగుటకు సందియము లేదు. తిక్కన తండ్రిపేరు తిక్కనకుమారునకుండుట లోకస్వభావము. కాని యిచ్చోఁ దిక్కన మనుమని కే ఆపేరున్నట్లుగా నున్నది. ఇది అచ్చపొరపాటైనఁ గావచ్చును. లేదా యిది కుమారునిపేరుగాక మనుమనిపేరైనఁ గావచ్చును. ఇట్టిదాని నిర్ధారణ చేయుటకు గ్రంథారంతరములు దొరుక వలయునని ప్రస్తుతములో మనకు లభ్యములు కాలేదు. కావున దాని న్వదలెదను.

సింగనకవియింటిపేరు.

ఇఁక నీవాసిష్ఠ రామాయణముం దెనిఁగించిన సింగనకవి యింటిపే రేమని విచారింపవలసియున్నది. అట్టిదానిని గ్రంథకర్త యెచ్చటను స్పష్టముగా వివరించియుండలేదు. కవిచరిత్రములో బ్ర. కం. వీరేశలింగముపంతులవారు ఇతని యింటిపేరు మడికివారుగా నిశ్చయించి యితఁడు మడికి సింగన