పుట:Kavijeevithamulu.pdf/692

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
686
కవి జీవితములు.

ఇట్లుగా నున్న పైసింగమనాయనికాలమునకుఁ గొంత తెలిసినది. ఎట్లనఁగా రెండవప్రతాపరుద్రుఁ డతని సంరక్షించియుండుటచేత నతని కాలము శా. స 1245 +78 - 1323 క్రీ. శకమువఱకు నగుటచేతను సింగమనాయఁడు గూడ క్రీ. స. 1323 వాఁడే కాఁగలడు. అతనికుమారుఁ డగుననపోతమనాయఁడు క్రీ. శ. 1300 శార్వరిలో నొక యుద్ధము జయించియుండె నని యుండుటచేత పై సింగమనాయఁడు క్రీ. శ. 1300 లకుఁ బూర్వమే అనగాఁ బ్రతాపరుద్రుఁడు మృతినందుటకుఁ బూర్వమే సుమారు ముప్పదిసంవత్సరములకు ముందు గతించి యుండవచ్చు నని తేలును. ఈకాలవిషయమై న్యూయలుదొర సంశయపడి యది అసందర్భమని దీనిని మఱి యఱువదిసంవత్సరములకుఁ బైన వచ్చు క్రీ. శ. 1360 గా సవరించెను. దీనికిఁ గారణము పై రెండవ ప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1323 లో గతించియుండుటం జేసియే అయి యున్నది.అట్లుగా నూహింప నవసరము లేదు. ప్రతాపరుద్రుఁడు డెబ్బదియాఱుసంవత్సరములు రాజ్యముచేసినట్లుండఁగా నతనికాలములోని వారందఱు డెబ్బదియాఱేండ్లవఱకు నుందు రని యూహించుట సయుక్తికముకాదు. ఇట్లుగా క్రీ. శ. 1300 లను 1360 గా సవరించుటయే చూచెనుగాని న్యూయలుదొర యీయన పోతనాయనితమ్ముఁ డగు మాదనాయని కాలముం జూచియుండలేదు. ఈసవరింపునకు వెనుకనే మాదనాయని పేరుక్రింద నీక్రిందివాక్యముల వివరించె. ఎట్లన్నను :_

"Mada Naidu (Mada additions to the Srisailam Temple) Killed Anapota Reddi, a relative of Ana Vema Reddi of Konda Veedu (A. D. 1339-1369 A. D.)"

అనఁగా నీమాదానీఁడు కొండవీటిసీమకుఁ బ్రభుఁ డగుననవేమారెడ్డికి బంధువుఁ డగుననపోతారెడ్డిని సంహరించె ననియు నామాదానాయనికాలము క్రీ. శ. 1339 మొదలు క్రీ. శ. 1369 వఱకున్నట్లు వ్రాసె. కావున మాదానాయనికిఁ బూర్వమధికారముచేసిన యతనియన్న యగుననపోతానాయఁడు క్రీ. శ. 1300 లలోఁ గాని అంతకుఁ బూర్వముగా