వెన్నెలకంటి వేంకటాచలము.
687
ని యుండక మాదానాయనిరాజ్యాంతమగు క్రీ. శ. 1360 నాఁటికి నుండునా ? కావున క్రీ. శ. 1300 అను పాఠమే సరియై యున్నది. అతని రాజ్యకాల మది మొదలు క్రీ. శ. 1337 వఱకు నుండియుండును. అనవోతమనాయనికొడుకు పెద్దసింగమనాయఁడును, ధర్మానాయఁడును గొంతకాలము రాజ్యముచేసినట్లుగా నితరగ్రంథములలోఁ గాన్పించు. ఆధర్మానాయనికొడుకు తిమ్మానాయఁడు. వీరిలో నిర్వురుగూడ రాజ్యముచేసిన నొక్కొక్కరికి బదేనువత్సరముల చొప్పున ముప్పదివత్సరములుచెప్పఁగా క్రీ. శ. 1340 + 30 = 1370 మొదలు అనఁగా శా. స. 1292 మొదలు నీ తిమ్మానాయనికాలము కాఁ గలదు. అతనికాలములో నున్న వెన్నెలకంటిసూరనయుఁ గొంచె మెచ్చుతగ్గుగా శా. స. 1300 గల కాలమువాడనితేలును.
(4) చంద్రశేఖరుఁడు.
"సీ. పరగఁ గ్రద్దలూరు బాలజోస్యులు వేడఁ, జంద్రశేఖరయ్య జగతిలోన
దత్తవృత్తిఁగొనియెఁదగఁబ్రసిద్ధికినెక్కి, మొదలిపేర నతఁడు బొదలుచుండె."
(5) వెన్నెలకంటివెంకయ్య.
ఈ వెంకయ్య యనునతఁడు వేజెళ్లనఱ్ఱా జనుసంస్థానీకునికడ మంత్రిగా నున్నట్లు క్రిందిపద్యములవలన గాన్పించు. ఎట్లన్నను :_
"సీ. ఘనులు నేగుడిలోపల గంగరాజు, అతనిపుత్త్రుఁడు వెంకన యనినవాడు
సరసుఁ డైనట్టివేజెళ్లసర్వఘనుని, మంత్రి యై యొప్పెరాజసన్మానమునను.
సీ. వేజెళ్లసఱ్ఱాజు విభవాదిపత్యంబు, పూనినసర్వజ్ఞపుణ్యమూర్తి
పోలుపొంద నా కృష్ణభూపాలుబాలుని, దొరఁజేసికొనికార్యమఱసినడిపె
శ్రీరంగరాయలచే నొప్పుఁగొని తెవ్వి, పంచవన్నెలడాలు పరగఁజేసె
కొండవీటిసరద్దు గుడ్లూరిదనుకను, ఏలించెఁ గృష్ణభూపాలునెమ్మి
తే. సకలప్రజ్ఞానదక్షుఁడైజనులఁబ్రోచె, రాజసన్మానములచేతఁదేజమలరె
బంధుజనముల సకలసంపదలదనిపె' మహితయశుఁడగు వెంగనమంత్రియపుడు."
ఇపుడు వేజెళ్ల నఱ్రాజనునతఁ డెవ్వరనియు నతనికాల మెప్పుడనియు విచారించవలసినదిగా నున్నది. ఈనడుమనే నావలన పైవేజెళ్లవా