పుట:Kavijeevithamulu.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

666

కవి జీవితములు.

కుమారగిరిరెడ్డి.

కొండవీటిలోఁ గులాగతమైన రాజ్యమునందె. ఇతని బాల్యములోఁ గాటయ వేమారెడ్డి మంత్రిగానుండి వ్యవహరించె. దానికిఁ బ్రత్యుపకృతిగా నీకాటయ వేమారెడ్దికి కుమారగిరిరెడ్డి రాజమహేంద్రవరము మొదలగు తూర్పుదేశము బహుమానమిచ్చెను.

5. మల్లవరశాసనములోని రెండవ రెడ్డివంశావళి.

కాటయరెడ్డి.

|

మారయరెడ్డి.

|

కాటయరెడ్ది.

ఇతనిభార్య వేమారెడ్డికొమార్తెయు అనవోత అనవేమారెడ్లతోఁబుట్టువగు దొడ్డాంబిక

వేమారెడ్డి

ఇతనిభార్య అన్న వోతరెడ్డి కుమార్తెయు కుమారగిరిరెడ్డితోఁబుట్టువు మల్లాంబ.

ఈమె శాసనం శా. స. 1333

6. అమరుక కావ్య వ్యాఖ్యాత యగు రెడ్డివంశావళి.

శ్రీశైలములో పాతాళగంగకు సోపానములు కట్టించిన వేమారెడ్డికి

జ్యేష్ఠసోదరుఁ డుగుమాచభూపాలుఁడు.

|

రేడిపోతరెడ్డి - కోమటి రెడ్డి. - నాగారెడ్డి.

|

వేమారెడ్డి (వ్యాఖ్యాత) - మాచరెడ్డి

ఇట్లుగాఁ బ్రస్తుతములోని విష్ణుపురాణ వంశావళిగాథలకు నవసరముగా వలయురెడ్డివంశావళులమాత్రము వివరించినాఁడను. పై వానింబట్టి "వేమయ అన్నవోతభూపాలుఁడు" "ఆళ్లయవీరభద్రరెడ్డి" ఎవరోస్పష్టముకాఁగలరు.

ఇట్లుండఁగా నాంధ్రకవిచరిత్రములో 83 వ పుటలో "తాను అనవోతరెడ్డికి ప్రబంధము లొసంగిన వెన్నెలకంటివారి వంశజుఁడననియు,