పుట:Kavijeevithamulu.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

667

వెన్నెలకంటి సూర్యునిమనుమఁడ ననియు, వేఱు వేఱుగాఁ జెప్పుకొనుట చేత నీతఁ డనవేమరెడ్డికాలములో నున్న సూరన్నకు మనుమని మనుమఁ డగుట స్పష్టము. మొదటిసూరన్న కైదవతరమువాఁడగుటచేత నిరువురకును నూఱుసంవత్సరములకంటె నెక్కువకాలవ్యత్యాస ముండి యుండవలెను." అని యున్నది. దీనిలో నాలోచించవలసినది వెన్నెలకంటి సూర్యుఁ డనునతఁ డెవ్వండని ? అతనికిని విష్ణుపురాణకవి యగుసూరన కవికిని గలసంబంధమేమి? దీనికి వీరేశలింగముపంతులుగారు కనిపెట్టిన మార్గము గ్రంథాధారము లేనిదైయున్నది. "వెన్నెలకంటివారిలో" ననియున్న దానికి వెన్నెలకంటి వంశమందుఁ బుట్టిన కవీశ్వరు లందఱిలో నని యర్థమూహించిరి. అంత విశేషార్థము దానిలో నాలోచించవలసిన పనిపేదు "వెన్నెలకంటివారిలో" ననఁగా వెన్నెలకంటివా రనుగృహ నామము గలవారిలో 'వెన్నెలకంటిసూర్యఁ డనునతనిమనుమఁడ నని' చెప్పినాఁడు. ఈసూర్యకవి "వేమయఅన్న వోతరెడ్డి" పైఁ గృతినిచ్చినట్లుగా నీవిష్ణుపురాణములోను అంతకుముందే వేమయభూపాలునకుఁగూడ గృతినిచ్చి యగ్రహారములు కొనియె నని విక్రమార్క చరిత్రములో నుండఁగా నా యిర్వురు వేఱు వేఱు కవీశ్వరు లనియు వారికీవిష్ణుపురాణ గ్రంథకర్తయగుసూరన మనుమనికి మనుమఁడనియు నిశ్చయించి అది స్పష్టమే యని పంతులవా రెట్లు నిష్కర్షించిరో తెలియదు. ఇట్టి నిష్కర్షకు పంతులవారికిఁ గలయాధారములు లేనిమాట స్పష్టమే. విక్రమార్క చరిత్రములోని పద్య మీవఱకే వివరించితి. కావుననీ వెన్నెలకంటి సూర్యకవి అనవోతభూపాలునిపైనేగాక అతని తండ్రి యగువేమభూపాలుని పైఁగూడ కృతియిచ్చినట్లు కానుపించును. దీనింబట్టి యీసూర్యకవి వేమభూమీశుని కాలములో బాలుఁడై యున్నట్లును, అతని కుమారుని కాలమునాఁటికి వార్ధికమం దున్నట్లును గానుపించు. అటులనే సూర్యకవి కొడుకుకొడు కగుసూరనకవి వేమభూపాలునికొడుకు అతనికొడుకగు కుమారగిరి రెడ్డికాలములో బాలుఁడై యున్నట్లు నాకుమారగిరి మేన