పుట:Kavijeevithamulu.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

662

కవి జీవితములు.

పై వేమారెడ్డికిని, అన్న వోతరెడ్డికిని గూడ వెన్నెలకంటిసూర్యుఁడే ఆస్థానకవి. కావుననతఁడు వేమా రెడ్డికంటెఁ జిన్న వాఁడు నన్న వోతరెడ్డికంటెఁ బెద్దవాఁడు నై యుండవలెను. సూర్యకవిపుత్రుఁ డగునమరయామాత్యుఁ డన్న వోతభూపాలునికంటెఁ జిన్న వాఁడు నాతనిపుత్రుం డగుకుమారగిరి రెడ్డికంటెను పుత్త్రికయగు మల్లాంబకంటెఁ బెద్దవాఁడునగు. అటులనే అమరనామాత్యుని పుత్రుఁడగుసూర్యకవి మల్లాంబకంటెఁ జిన్నవాఁడును తత్పుత్త్రిక యగునితల్లీదేవికంటెఁ బెద్దవాఁడు నై యుండవచ్చును. కాని నితల్లీదేవి భర్త యగు నళ్లయ వీరభద్రరెడ్డివయస్సెంతో మనకుఁ దెలియదు గావున నతఁడు సూరనకంటెఁ బెద్దవాఁడో లేక ఆయిర్వురునొకయీడువారో ఊహింపవీలులేదు. ఆవిషయమెట్లున్నను వీరభద్రరెడ్డి అనంతరకాలములోఁ గృతినందినరాఘవరెడ్డికంటె నాతఁడు పెద్దవాఁ డనిచెప్పుటకు సందియ ముండదు. ఈ వీరభద్రరెడ్డియనంతర మతని తమ్ముం డగుదొడ్డయరెడ్డి అధికారము చేసినట్లుగా నాతనివలనఁ జేయంబడినకొంకుదుటి తామ్రశాసనముంబట్టి కాన్పించు. దానికాలము శా. స. 1352. ఇట్లుగా నీతఁడు రాజ్యము చేసినట్లున్నను రెడ్లసంపూర్ణాధికారము వీరభద్రరెడ్డితోనే ముగిసినట్లు కనుపించు. పై రాఘవరెడ్డి వీరభద్రరెడ్డి యనంతరము రాజ్యము చేయుచున్న దొడ్డారెడ్డిపేరు స్మరియింపక అతనియన్న వీరభద్రరెడ్డిపేరుమాత్రమే స్మరియించుటచే నతఁడు దొడ్డారెడ్డికాలీనుఁ డని యూహింపఁదగియున్నది. అప్పటికిఁ గృతి నందినరెడ్డిరాజులలోఁ జివరవాఁ డీవీరభద్రరెడ్డియేకా వున నళ్లయ వీరభద్రరెడ్డిమొదలగు తొల్లిటిం రెడ్డిరాజులు కృతిముఖంబుననే కీర్తులు సంపాదించినట్లు రాఘవరెడ్డి వచించె. ఈ వీరభద్రరెడ్డి పైఁగృతినిచ్చినవాఁడు శ్రీనాథుఁడు కావున నీశ్రీనాథుఁడును వెన్నెలకంటి సూరనకవియు సమకాలీనులు కాక తప్పదు. అటుకావున సూరనకవి శ్రీనాథునిప్రాచీనాంథ్రకవులలోఁ జేర్చి వర్ణించనట్లు కాన్పించదు.