పుట:Kavijeevithamulu.pdf/669

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

663

రాఘవరెడ్డి నివాస్థానము.

ఇది గుడ్లూ రనునామంబునఁ బిలువం బడుచుండును. ఈగ్రామముయొక్క విశేషము లొకపద్యములో నీగ్రంథములోనే వివరింపఁబడినవిః ఎట్లనఁగా :-

"సీ. గౌరీసమేతు డైఁగరిమతో నేవీట, నేపారు నీలకంఠరేశ్వరుండు
      వారాశికన్యతోవర్తించు నేవీట, గిరిభేదిసుతుఁడైనకేశవుండు
      యోగినీసహితయై యొప్పారు నేవీటఁ, బసిఁడిపోలేరమ్మ భవునికొమ్మ
      పాపవినాశయై ప్రవహించు నేవీట, మన్నేఱుమిన్నేటిమాఱటగుచుఁ
      గుంజరములు వేయికొలువంగ నేవీటఁ, గొడగుచక్రవర్తి పుడమి యేలె
      నట్టిరాజధాని యై యొప్పుగుడ్లూరి, నొనర నేలుచుండి యొక్క నాఁడు."

ఈ గుడ్లూరు గ్రామమే హరివంశమును రచియించిన యెఱ్ఱప్రెగడ నివాసస్థలము. దాని నాతఁ డీక్రింది విధంబున వర్ణించిచెప్పె.

ఆరణ్యపర్వశేష మగునాశ్వాసములలోఁ జివరనున్న యాశ్వాసము చివరసీసపద్యము.

"సీ. భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు, శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
      సంతతధ్యానసంసక్తచిత్తుఁడు సూర, నార్యునకును బోతమాంబికకుని
      నందనుం డిల పాకనాటిలో నీలకం,ఠేశ్వర స్థానమై యెసకమెసఁగు
      గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు, ధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ
      డెఱ్ఱనార్యుఁడు _________"

ఇట్టిపద్యములంబట్టి పై గుడ్లూరుగ్రామము పాక నాటిసీమలోని దని తేలినది. అది పై రావూరి రాఘవరెడ్డికి ముఖ్యపట్టణము. ఈ రాఘవరెడ్డియింటిపేరు రావూరివా రని యుండుటచేతను, రావూరను నొక గ్రామముండుటచేత నతని కాఁపురస్థలము రావూ రని కొందఱభిప్రాయపడుదురు. అది సరికాదు. గుడ్లూరనునది కొడగుచక్రవర్తికి ముఖ్యస్థానమనియు నది తదనంతరమున నీరాఘవరెడ్డిస్వాధీనమైనట్లుగా నున్నది. కావున నీ రాఘవరెడ్డి గుడ్లూరి సంస్థానాధిపతియని నిర్ణయించెదము. పైకొడగు చక్రవర్తి యెవరో దానిం దెల్పుగ్రంథసహాయములు