పుట:Kavijeevithamulu.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

639

యజ్ఞశాలయందె చాల నుతియింపంబడి యుండుఁగావున నీమనంబున నే నధికసంపన్నుండ ననియుఁ జితాభస్మాస్థిధారుం డైనరుద్రుండు దరిద్రుం డనియు గర్వింపఁ జన దని వెండియు నిటనియె.

ఉ. నీలగళాపరాధి యగునీకుఁ దనూభవనౌట చాలదా
    చాలుఁ గుమర్త్య నీదుతనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడిన్
    జాలధరన్ మహాత్ములకుఁ జయ్యన నె గ్గొనరించుజన్మమున్
    గాలుపనే తలంప జనకా కుటిరాత్మక యెంచిచూడఁగన్.

చ. వరవృషకేతనుండు భగవంతుఁ డునైనహరుండు నన్ను నా
    దరపరిహాసవాక్యముల దక్షతనూభవ యంచుఁ బిల్వ నేఁ
    బురపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచస్స్మితంబులన్
    దొరఁగుడు నీతనూజ ననుదుఃఖముకంటెనుఁ జచ్చు టొప్పగున్."

అని యున్నది. ఇట్లుగా నుండినకథాకల్పకు లిరువురిలోఁ గల్గువిశేషంబులు పాఠకులే యోచించెదరుగాక. భాగవతములోఁ బోతనామా

అనంతరకథావృత్తాంతము.

త్యుఁ డట్లుగాఁ బల్కుచు దాక్షాయణి యోగాగ్నిచే దగ్ధ మయ్యె ననియు నపుడు రుద్రాణితో వచ్చియున్న రుద్రపార్ష దులందఱును దక్షుని సంహరింప విజృంభించిన నధ్వర్యుం డగుభృహుమహర్షి యొకయభిచార హోమంబున ఋభునామధేయుల నగ్నికుండంబు నుండి యుదయింపం జేసిన వారు వచ్చి రుద్రపార్షదులఁ బాఱం దోలి రనియుఁ జెప్పి యా వృత్తాంతబంతయు నారదునివలన నా వెంటనే యీశ్వరుండుతెలిసికొని,

"శా. ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై
      మాద్యగ్భూరిమృగేంద్రఘోషమున భీమప్రక్రియన్ నవ్వుచున్
      విద్యుద్వహ్ని శిఖాసముచ్చయ రుచి న్వెల్గొందు చంచజ్జటన్
      సద్యఃక్రోధముతోడఁ బుచ్చి వయిచెన్ క్ష్మాచక్రమధ్యంబునన్."

అని యీశ్వరునకు దాక్షాయణీవృత్తాంత శ్రవణానంతరమునఁ గలిగిన కోపవిశేషమంతయు వర్ణించి చెప్పె. పిమ్మట నట్లుగాఁ బెఱికి వైచినజడయందు వీరభద్రావతారము కలిగినట్లును అతఁ డీశ్వరుని