పుట:Kavijeevithamulu.pdf/644

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
638
కవి జీవితములు.

సీ. అనయంబు శివ యనునక్షరద్వయమర్థి, వాక్కునఁ బలుక భావమునఁ దలఁప
    సర్వజీవులపాపసంఘముల్ చెడునట్టి, మహితాత్మునందు నమంగళుండ
    వగునీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు నందెద వినుము నీ వదియుఁ గాక
    చర్చింప నెవ్వనిచరణపద్మంబుల, నరసి బహ్మానంద మనుమరంద

గీ. మతులభక్తిని దమహృదయంబులనెడి, తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
    లగుదు రత్యంతవిజ్ఞాను లట్టిదేవు, నందు ద్రోహంబు చేసి తేమందు నిన్ను.

క. మఱియును నమ్మహితాత్ముని, చరణసరోజాతయుగము సకలజగంబుల్
    నెఱిఁగొలువఁ గోరుకోర్కులఁ, దఱమిడి వర్షించు నతనిఁ దగు నే తెగడన్.

చ. పఁరగఁ జితాస్థిభస్మనృకపాలజటాథరుఁడున్ పరేతభూ
    చరుఁడు పిశాచయుక్తుఁడని శర్వు నమంళు గాఁ దలంప రె
    వ్వరు నొకఁ డీవుదక్క మఱి వాక్పతిముఖ్యులు నమ్మహాత్మున
    చ్చరణసరోజరేణువులు సమ్మతిఁ దాల్తురు మస్తకంబులన్.

చ. నెలకొని ధర్మపాలనవినిర్మలు భర్గుఁ దిరస్కరించున
    క్కలుషునిజిహ్వఁ గోయఁదగుఁగా కటుసేయఁగ నోపఁడేనిఁదాఁ
    బొలియుట యొప్పు రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణరంధ్రముల్
    బలువుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు థర్మవర్తనుల్.

    వ. అది గావున.

మ. జునుఁ డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సం బైనయన్నంబు స
      య్యన వెళ్లించి పవిత్రుఁ డైనగతి దుష్టాత్ముండ వై యీశ్వరున్
      ఘను నిందించిననీతనూభవ యనంగా నోర్వ నీ హేయభా
      జన మైనట్టిశరీరము న్విడిచి భాస్వచ్ఛుద్ధి వాటిల్లెదన్.

వ. అదియునుంగాక దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతలగమనంబును, స్వాభావికంబులైనట్లు ప్రవృత్తినివృత్తికర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటంజేసి రాగయుక్తు లై కర్మతంత్రులైనసంసారులకు వైరాగ్య యుక్తులై యాత్మారాములైన యోగిజనులకు విధినిషేధరూపంబు లైనవైదికకర్మంబులు గలుగుటయులేకుండుటయు నైజంబులగుటంజేసి స్వధర్మనిష్ఠుఁడగువాని నిందింపంజన దాయుభయకర్మశూన్యుండు బ్రహ్మభూతుండు నైనసదాశివుని గ్రియాశూన్యుం డని నిందించుట పాపం బగుఁ దండ్రీ సంకల్పమాత్రప్రభవంబు లగుటంజేసి మహాజనయోగి సేవ్యంబు లైనయస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు. భవదీయంబు లగునైశ్వర్యంబులు ధూమమార్గప్రవృత్తు లై యా గాన్న భోక్తలైనవారిచేత