పుట:Kavijeevithamulu.pdf/633

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

627

బడనివాని నేల చేర్చును ? దక్షుఁడు కైలాసమునకుం బోయి యీశ్వరునివలన గౌరవము కలుగలే దనుకోపము నంది యీశ్వరుని శపియించినపట్టున నాతనివెంబడినే నందికేశ్వరుఁడు లేచి దక్షుని, బ్రాహ్మణుల శపియించె ననియు, నది విని భృగుమహర్షి లేచి శివానుచరుల నాతఁడు శపియించె ననియుఁ జెప్పినకథాభాగములో నందికేశ్వరునివలన బ్రాహ్మణనిందయు భృగుమహర్షివలన శైవులనిందయుఁ జేయంబడినవి. ఇట్టి వృత్తాంతముఁ దెనిఁగించుటచేతనే పోతనామాత్యునకు వాచాదోషము కలుగు ననఁగా నిఁకఁ జెప్పవలసిన దేమున్నది. అయిన నాపట్టులోఁ బోతనామాత్యుం డెంతవఱకు నిందార్హుఁడో చూచిగాని నిర్ణయించను. పోతనామాత్యునివ్రాఁత లెట్టులున్నవో యీక్రింద చూపెదను.

భాగవతచతుర్థస్కంధమున నీశ్వరునకును దక్షప్రజాపతికిని విరోధము సంభవించినకథలో దక్షుఁ డీశ్వరుం జేసిననింద.

"సీ. అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన, హీనుఁడు మర్యాద లేనివాఁడు
      మత్త్రప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం, బరుఁడు భూత ప్రేతపరివృతుండు
      తామసప్రథమభూతములకు నాథుండు, భూతిలిప్తుం డస్థిభూషణుండు
      నష్టశౌచుండు నున్మదనాంగుఁడును దుష్ట, హృదయుండు నుగ్రపరేతభూని
      కేతనుఁడు వితతశ్మశ్రుకేశుఁ డశుచి, యైనయితనికి శివనాముఁ డనుప్రవాద
      మెటులఁ గలిగె నశిపుఁ డగు నితని నెఱిఁగి, యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటుల

      వ. ఇతనికి నన్మత్తనయను విధిప్రేరితుండ నయి యిచ్చితి.

క. ఇతఁ డింద్రోపేంద్రపరీ, వృతుఁ డై సుఖసమయమున హవిర్భాగము దే
    వతలం గూడఁగ మహితని, యతిఁ బొందక యుండుగాక యని శపియించెన్."

ఇది దక్షుఁడు చేసినట్లుగాఁ బోతనామాత్యుఁడు శివుని చేసె నని చెప్పిన యొకనిందకాని యావెంటనే చెప్పినవచనముంబట్టి దక్షునినింద శివునకు నుతియే యైన దనియు నంతియ కాక అక్కడ వచ్చి యుండిన ఋషు లందఱు దక్షుని నిందించి రనియుఁగూడఁ బోతనామాత్యునివలననే చెప్పఁబడినది. ఎట్లన్నను :-