పుట:Kavijeevithamulu.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

626

కవి జీవితములు.

భాగవతగద్యము.

"ఇది శ్రీపరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్త్ర సహజ పాండిత్య పోతనామాత్య"

అనియున్నది.

వీరభద్రవిజయగద్యము.

"ఇది శ్రీమ న్మహా మాహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యప్రసాద పాదపద్మారాధక కేసనామాత్య పుత్త్ర పోతయనామధేయ"

అని యున్నది.

ఈ రెండుగద్యములం జూచినతోడనే గ్రంథకర్త లిర్వురు నొక్కరు కా రనియు నట్లే యైన రెండుగద్యములును రెండువిధంబుల వ్రాసి యుండ రనియుఁ జెప్పవలసియున్నది. భాగవతకవికిం గల 'సహజపాండిత్య' శబ్దము రెండవయతనికి లేదు. ఇదివఱలో మొదటియతని కవిత్వ మీశ్వరవరప్రసాదలబ్ధ మనియు, రెండవయతనికవిత్వము వీర మాహేశ్వరాది కటాక్షసంప్రాప్త మనియుఁ జెప్పియే యున్నాను.

3. భాగవతములో దక్షయజ్ఞ సమయములో బోతనామాత్యునివలన నీశ్వరనింద చేయంబడినట్లుగా వీరభద్ర విజయములోఁ జెప్పంబడినది. దానికిఁగాను చతుర్థస్కంధములో దక్షయజ్ఞ కథాభాగమంతయుఁ జదివినాఁడను. అందు శివనింద లేదు సరిగదా పైగా శివ పరాత్పరత్వ వర్ణనమే పోతనామాత్యునివలన విశేషించి చేయంబడినది. పోతనామాత్యుఁడు కేవలాద్వైతి యై యుండియు

"చేతులారంగ శివునిఁ బూజింపఁడేని, నోరు నొవ్వంగ, హరికీర్తి నుడువఁడేని
 దయము సత్యంబు సమముగాఁ దలఁపడేని, కలుగ నేటికిఁ దల్లులకడుపుచేటు."

అని చెప్పి గ్రంథారంభము చేసినవాఁడు నీశ్వరోపాసనాపరుండు గూడ నైనచో శివస్తోత్రము చేయుటలో లోపముచేయునా ? ఇది గాక పోతనామాత్యుఁడు తాఁ దెలిగించుచున్న గ్రంథమంతయు స్వకపోలకల్పితము కానందున నద్దానిలో స్వాభిప్రాయము మాతృకాగ్రంథములలో ననఁగా భాగవతాది విష్ణుకథాప్రధానగ్రంథములలోఁ జెప్పం