పుట:Kavijeevithamulu.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

586

కవి జీవితములు.

చలేదు. ఇట్టిగాథలన్నిటిం జేర్చిన [1] "కవికావ్య ప్రశంసాచంద్రిక" అనుపేరు గలయొక అనుబంధగ్రంథము ఈకవిజీవితముల వెంటనే ప్రకటింపఁబడుచున్నది. కావున దీనిలో వదలఁబడినవారిచారిత్రములు దీని యనుబంధములోఁ జూచెదరుగాక యని వివరించి యింకొక విజ్ఞాపనయుఁ జేయుచున్నాఁడను. ప్రౌఢప్రబంధకవులం జెప్పిన తోడనే శృంగారబ్రబంధములఁ జెప్పినవారి చారిత్రలును వినునిచ్చవొడమగలదు. అట్టి భాగములోఁ జేర్చఁదగిన వారిలోఁ జారిత్రములు గలవారు శాస్త్రకవులుగూడ నై యుండుటచేత వారిచారిత్రములు 'శాస్త్రకవులు' అను మఱియొక భాగములోఁ జూడవలసియుండును. ఈవఱకే యీకవిజీవితము లైదాఱుఖండములైనది. ఇంతకు విశేషఖండములు చేసినఁ గొన్ని బాధ లున్నవి కావున నీక్రింద వివరింపఁబడు "శృంగారకవులప్రశంస" జూచి ఆకవిత్వ కాల మెట్టిదియో అపుడు పేరందినవా రెవ్వరో చూచి వలయునేని వారిచారిత్రములు 'కవికావ్యప్రశంసాచంద్రిక' అను దీనియనుబంధములోఁ జూచెదరుగాక.

శృంగారప్రబంధకవులప్రశంస.

ఇదివఱలో నాంధ్రభాషలోఁ బుట్టిన ప్రబంధములలోఁ గొన్నిటింగూర్చి వ్రాసియుంటిమి. ఆప్రబంధములు పుట్టిన కాలానంతరమునందనఁగా శాలివాహనశకము 16, 17 వ శతాబ్దములలో బయలు వెడలిన కావ్యములంగూర్చి వివరించవలసియున్నది. పైప్రబంధముల పోల్కినే పైశతాబ్దములకవులు గ్రంథరచన చేయం దొరకొన నంతకంతకుఁ బాకమునందు మార్దవమును వర్ణనాంశములలో శృంగారరసము ప్రధానమగుచు వచ్చెను. ఆకావ్యములఁ దఱుచుగా శృంగారకావ్యములని, శృంగారప్రబంధము లని కొందఱు వివరించిరి. కేవలము ప్రబంధములే యని కొందఱు వివరించిరి. ఎట్లన్న నీగ్రంథములు ద్రాక్షాపాక విలసితములై సర్వజనరంజకము లై యుండి పండితపామర పఠనీయంబులైనవి. ఇట్టికావ్యరచనలో వివిధరసంబులు హృదయాహ్లాదకరంబుగఁ దెచ్చుట సులభము కాదు. ఈకావ్యములు క్రమక్రమముగఁ బంచకా

  1. కాల మీతని నీగ్రంథముం బ్రకటింపనీయలే దని తోఁచెడిని.