పుట:Kavijeevithamulu.pdf/593

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
587
శ్రీ కృష్ణదేవరాయలు.

వ్యము లని ప్రసిద్ధి నొందిన గ్రంథములస్థాన మాక్రమించుకొని వానిం గఠినకావ్యము లనిపించి తామే సరసకావ్యము లై సర్వజన పఠన పాఠనములలో నున్నవి అట్టికావ్యము లాకాలములలో నాంధ్రదేశములోని యన్నిదిక్కులఁ బుట్టుచువచ్చినట్లుగాఁ గాన్పించు. ఆగ్రంథముల నన్నిటిం దెల్పుట శ్రమసాధ్యము నుపయోగము లేకుండుటయు నగుఁగావున నట్టి వానిం దెల్పక స్థాలీవులాకన్యాయముగాఁ గొన్నిటినిమాత్రము వివరించెదను. అట్టిపనిఁ జేయుటకుఁ బూర్వమున్న వివిధసీమలు (ఖండములు) దెలియఁబఱచవలసియున్నది. కావున వాని నొకవిధముగా నిర్ణయించుకొని పిమ్మట నట్టిఖండములలోఁ బుట్టినగ్రంథముల వివరించెదను. ఎట్లన్న ను:-

ఆంధ్రదేశమునకుఁ దూర్పున సముద్ర మున్నదిగదా. ఆకారణమున నాసముద్రతీరములనే గంజాము, విశాఖపట్టణము, గోదావరి, కృష్ణా నెల్లూ రనుమండలములు (ఖండములు) న్నవి. ఈమండలములలోని దేశములనే పూర్వము కళింగము, వేఁగి, విదర్భ మనుదేశములుగా వ్యవహరించిరి. ఈవిదర్భదేశము కృష్ణామండలములోనిది. దీనిం బురస్కరించుకొని నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, బళ్లారు లనుమండలము లున్నవి. ఇవి కొంచె మెచ్చుతగ్గుగాఁ గృష్ణానదికి దక్షిణభాగములో నుండును. ఆకృష్ణానది కుత్తరభాగములో బెజవాడ మొదలు హైదరాబాదువఱకుం గల తెనుఁగుదేశము త్రిలింగదేశ మని పూర్వము వాడు కొనంబడు తెలింగానా ఖండము. ప్రస్తుత మది 'గోలకొండ' దేశముగాఁ జెప్పవలసియుండును. కాఁబట్టి, 1. ఖండములోని కళింగ, వేఁగి దేశములకుఁ బ్రాగుదీచీఖండమనియు, 2. ఖండములోని విదర్భదేశము (నెల్లూరుజిల్లాలోని అద్దంకి సీమ) నకు ప్రాగ్దక్షిణఖండమనియు, 3. కృష్ణానదికి నుత్తరముగా నుండు దేశమునకుఁ బశ్చిమోత్తరఖండ మనియు గోలకొండఖండ మనియు, 4. కృష్ణానదికి దక్షిణముగా నుండు ఖండమును దక్షిణఖండ మనియుఁ జెప్పెదను.

ఇట్లుగా నేర్పర్చితిం గావున నాయాఖండములలో నత్యాదరణీయము లగుప్రబంధంబులఁ గొన్నిటి వివరించెదను. ఎట్లన్నను .