పుట:Kavijeevithamulu.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

581

పూ. 6. "ఈ ప్రబంధము పెటుకుగా నుండుటకును, అచ్చటచ్చట గొన్నిస్ఖాలిత్యములఁ గల్గియుండుటకును గారణంబు జూడ నీగ్రంథంబు పెద్దన కృతంబు గా దని యును, రాయల కృతం బనియు లోకులకుఁ దోఁచుటకై పెద్దన బుద్ధి పూర్వకముగా బన్నిన యుక్తి యై యుండవలెను. లేదా, 3 (a) పద్యప్రకారము విష్ణుచిత్తీయము మనుచరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమరచితగ్రంథంబున నొకటిరెండు తప్పు లుండుట సహజంబు.

స. 6 దీనిలో గ్రంథము పెటుకుగానుండుట యనుదానికర్థము తెలియలేదు. పండితాభిప్రాయ మిది నారికేళ పాకముగ నుండుననిగాని అది యొకలోప మగుపాకము గల దని కాదు. పెద్దన కావలెనని కొన్ని తప్పులు చెప్పినఁ జెప్పుట గల్గుగాని తనకవిత్వముకంటె నధికమైన కవిత్వముగాని తనశక్తికి మించినవర్ణనలుగాని చెప్ప లేఁడుగదా. ఆముక్తమాల్యద మనుచరిత్రమునకంటెఁ గఠినమైనను అంతకంటె వర్ణనాంశములో నధిక మనియే సర్వపండితులవలన నంగీకరింపఁబడును. కావున నిందులోఁ బెద్దన బుద్ధిపూర్వకముగాఁ జేసినయుక్తిగాని చేయఁగల యుక్తిగాని లేదుగావున నీవిషయ మింతకంటె వ్రాయ నక్కఱలేదు. విష్ణుచిత్తీయము మనుచరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమరచిత గ్రంథంబున నొకటిరెండుతప్పు లుండుట సహజం బని చెప్పిన దానికి గ్రంథదృష్టాంతరములు లేవు. ఒకవేళ నుండునెడల భారతమున కంటె ముందుగ రచియింప బడినయుత్తర రామాయణములోఁ దిక్కనవలన నెన్ని తప్పులు వ్రాయంబడినవో హరిశ్చంద్రనలోపాఖ్యానమున కంటె ముందుగ రచియింపఁబడిన వసుచరిత్రమున రామరాజభూషణుఁ డెన్ని తప్పు లుంచెనో, భీమఖండమునకంటెఁ బూర్వము రచియింపఁబడిన శృంగారనైషధమున శ్రీనాథుఁ డెన్నితప్పు లుంచెనో చూపినయెడలఁ బెద్దన మనుచరిత్రమునకంటె ముందుగ రచియించిన ఆముక్తమాల్యదలో నన్నితప్పు లుంచెను. అని చెప్పెదము అటుగానిచో 3 (d) లోఁ జెప్పంబడిన విధముగ నాముక్తమాల్యదకంటె ముందుగ రచియించిన మనుచరిత్రములో నెన్ని తప్పు లుంచెనో యోచింపవచ్చును. ఈపట్టునఁ