పుట:Kavijeevithamulu.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

576

కవి జీవితములు.

అది యెట్లనఁగా :-

మ. అలుకన్ ఘోటకధట్టికాఖురపుటీహల్య న్గురాసానిపు
     చ్చలువో దున్ని చలచ్చమూగజమదాసారప్లుతిం గీర్తి పు
     ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తౌ తొల్లి యే
     దులఖానోగ్రకపాలమర్థపహరిద్భూజాంగలశ్రేణికిన్.

ఇది యంతయు మనుచరిత్రానంతర వృత్తాంతమే. ఇట్లు ఘంటా పథముగా మనుచరిత్రమునకుఁ దరువాతికాలములో నాముక్తమాల్యద రచించినందులకు గ్రంథదృష్టాంతము లగపడుచుండఁగా వాని నూహించికొని, లోకములో సంప్రదాయజ్ఞులవలన వాడుకొనంబడుచున్న కవికర్ణరసాయనవృత్తాంతము నమ్మక కృష్ణరాయనికాలములోనికవిత్వమని యూహింప ననువులేని పైచాటుధార పద్యము నమ్మిన నిఁక వందలకొలఁది చారిత్రగ్రంథములు పుట్టవచ్చును. కాఁబట్టి పాఠకు లిట్టిచాటువుల నెంతమాత్రమును విశ్వసించకపోదురుగాక.

పూ. 3 (b) పాండురంగ విజయమునందలి ప్రౌఢదీర్ఘ సమా సపదముఖసీసమునందు ద్వితీయచరణము "దానతల్లిగ నల్లసాని పెద్దనచెప్పె ముది మది దప్పి యాముక్తమాల్యదూ" అని యున్నది.

న. 3. (b) కాని ఈ పద్యచరణమును పైపద్యమును దాని నీపద్యచరణమును బూర్వపక్షము చేయుచున్నవి. ఈపద్య చరణమొకగ్రంథములోనిదే యయియుండిన పైచాటువులోఁజెప్పినగాథ తప్పేగద. కావున నాముక్తమాల్యద (విష్ణుచిత్తీయము) మనుచరిత్రముకంటె మొదట రచియింపఁ బడక పెద్దనవలన నతనిముసలితనములో మదితప్పియున్నపుడు వ్రాయఁబడినదని యూహించెదముకాక. కాని యిట్లుగా నొకదాని నొకటి తిరస్కరించు రెండుదాహరణ లుపన్యాసకునివలనఁ జూపింపఁబడుటకుఁ గారణ మేమో నే నూహింపలేకయున్నాను. ఆముక్తమాల్యదలో నచ్చటచ్చటఁ గాన్పించుస్ఖాలిత్యములు పెద్దన ముసలితనములో నాగ్రంథము వ్రాయంబడుటం జేసి కల్గె నని చెప్పుటకుఁ గానోవు. అటులనే యైనచో (6) నాఱవపూర్వపక్షములోని 3 (a) ప్రకారము విష్ణుచిత్తీయము మను