పుట:Kavijeevithamulu.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

575

మైనది లేదు. ఇట్టి పద్యము సముద్రితగ్రంథ చింతామణి ప్రకటించినందులకు విచారపడవలసియున్నది. ఇట్లుగాఁ దల మొల లేనిపద్యముం బట్టి యే కదా ఆముక్తమాల్యలలోని గ్రంథప్రణాళిక నాశ్వాసాంతపద్యముల నిరసించి ఇదివఱలోఁ జేయఁబడియున్న సిద్ధాంతమును దిరస్కరించుట ? కాని అట్లు తిరస్కరించుటకుఁ బూర్వము, ఆముక్తమాల్యద ముందు రచియింపఁబడినదో లేక మనుచరిత్రము ముందు రచియింపఁబడినదో పరిశీలించెదము గాక. ఆపరిశీలన అగువఱకును పెద్దనయే యా రెండుగ్రంథముల రచియించె నని యూహించెదము.

మనుచరిత్రములోఁ జెప్పంబడిన కృష్ణరాయ విజయములు.

1. ఉదయాద్రిని జయించె. 1. కొండవీడు జయించె. 1. వేఁగిదేశమును జయించె. 1. కనకగిరిం జయించె. 1. గౌతమీనదిని దాఁటె. 1. పొట్నూరు జయించెను. 1. మాడుగుల. 1.(వడ్డాది) జయించెను. 1. కటకపురిం గాల్చెను. అపుడు గజరాజు పాఱెను.

ఆముక్తమాల్యదలోఁ జెప్పంబడిన కృష్ణరాయ విజయములలోని విశేషములు.

మనుచరిత్రములోఁ జెప్పిన విజయములన్నియుఁ జెప్పి పిమ్మటఁ కలబరిగె (Kalbarga) లో నుండుయవనప్రభువుల జయించిన ట్లీక్రింది పద్యములో నున్నది

"గీ. తిరుగు హరిపురి సురతరు సురల మరిగి, బహుళహళహళి భరితకల్బరిగనగర
     సగరపురవరపరిబృఢజవనయవన, పృతన భవదసి ననిఁ దెగి కృష్ణరాయ."

అనియున్న దానింబట్టి 1. కలబరిగ. 2. సాగర్ (Sauger) అను రెండు స్థలములలోనుండు దురుష్కప్రముఖుల జయించె. ఇంతియకాక పారసీకదేశము (Pershya) లో నుండెడుఖురాసాన్ (Khorasan) ఖండములోని తురుష్కులం జయించె నని మఱియొకపద్య మున్నది.