పుట:Kavijeevithamulu.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

542

కవి జీవితములు.

నే రామచంద్రునిపై నైదువేలగుఱ్ఱపుదళముతో బయలుదేఱెను. రెండు సైన్యములు పిలంకజిన్నరీవద్ద నున్న నదివద్ద కలుసుకొనెను. రామచందరు పదివేల గుఱ్ఱపుదళముతోను, లక్ష కాల్బలముతోను, మూఁడువందలయేనుఁగులతోను మధ్యను నిలువఁబడెను. వానికుడిపార్శ్వమున పదివేలగుఱ్ఱములతోను, లక్షకాల్బలముతోను రెండువందలయేనుఁగుల తోను వానియన్న కుమారుఁ డగువిద్యాధరుఁ డుండెను. వానియెడమపార్శ్వమున పదివేలగుఱ్ఱములతోను, లక్షకాల్బలముతోను, రెండువందలయేనుఁగులతోను హరిశ్చంద్రుఁడు, షెటాబీఖాను, ఇంకను మిగిలిన రాజులును ఉండిరి. విలుకాండ్రు ఏనుఁగులపై నున్నహవుదాలపైఁ గూర్చుండిరి. ఈహవుదాలు తుపాకులు మొదలైనవి పట్టుకున్న వారిచే కాపాడఁబడెను.

ఫాదిషా యిరువదివేలగుఱ్ఱములతో మధ్యను నిలువ బడెను. వానికుడిపార్శ్వమున వానికొడుకు (షాజాడా) హైదర్ ఖాన్ పదునేను వందల గుఱ్ఱములతో నుండిరి. వాని యెడమపార్శ్వమున ఫాట్‌హిఖాన్ పదనైదువందలగుఱ్ఱములతో నుండెను. అప్పుడు జరిగినపోట్లాటలో, విధ్యాధరుఁడు షాజాదాచేఁ జంపబడెను. రామచంద్రుఁడు ఖయిదీగాఁ బట్టుకోఁబడెను. యుద్ధమునకు వచ్చినయితర రాజులు పాఱిపోయిరి. వారియేనుఁగులు ద్రవ్యము ఇతరమైన ఆస్తి ఫాదిషా తీసికొనెను.

అప్పుడు ఫాదిషా కొండపల్లికి బయలుదేఱెను. అక్కడ రేషీడ్ ఖాన్ అను వానిని కోటను తీసుకొమ్మని కొంతసైన్యముతో నుంచి, తాను రాజమహేంద్రవరము, ఏలూరు వైపులకు బయలుదేఱెను.

ఏలూరు ప్రవేశించిన పిమ్మట అతఁడు అక్కడికొండయధికారులను జయించు మని తనసేనానాయకులను బంపెను.. వారు వెళ్లి ఏలూరుపరగణాయం దున్నముఖ్యుల నందఱను జయించి వచ్చిరి.

ఫాదుషా రాజమహేంద్రవరమువద్ద నున్ననదిసమీపమునకు రాఁగానే, ఆదగ్గఱ నున్నయడవులయందు కొందఱు శత్రువులు రాత్రి