పుట:Kavijeevithamulu.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

541

కొండ అను నీమూఁడు స్థలముల నాక్రమించుటకు బయలుదేఱెను. వేలంకొండ మొట్టమొదట తీసుకొనఁబడెను. పిమ్మట షితాబ్‌ఖానుఁడు చక్రవర్తి సైన్యమును యుద్ధముచేసెను. షితాబ్ ఖాన్ పాఱిపోయి కంబముమెట్టుకోటయందు దాఁగుండెను. ఈసంగతి నతఁడు దగ్గఱరాజులకుఁ దెల్పివారిసహాయము కోరి వారినందఱిని కంబముమెట్టు వారంగల్ కోటలకు తీసుకొనివచ్చెను. ఘోరయుద్ధ మైనపిమ్మట షితాబ్ ఖానును ఆతనిమిత్త్రులను ఫాదుషా యోడించెను. షితాబ్ ఖాన్ టెళ్లింగానారా జైనరామచంద్రదేవువద్ద శరణుజొచ్చెను. ఈతఁడు విశేషబలము కలవాఁడు. అతిగిరి, ఇంద్రకొండ, నాయలకొండ, కొండపల్లి మొదలగు దుర్గము లీతనిస్వాధీనములాయెను. బాదిషా కంబముమెట్టు దుర్గమును పట్టుకొని, వాని యావదాస్తిని దోఁచికొని. వానికుటుంబమును బంధువులను ఖైదీలనుగాఁ దీసుకొని పోయెను. బాదిషా ఓరంగల్‌కోటను నెవరిచే నెదుర్కొనబడకుండ నాక్రమించెను.

గజపతిరాజు పుత్త్రుఁడైన రామచందర్ టెలింగానాదేశమును బెంగాల్ దేశపు సరిహద్దువఱకు వ్యాపించియున్న ఒరిస్సాదేశమును తన స్వాధీనమం దుంచుకొని, కొండపల్లి రాజధానిగాఁ జేసుకొని రాజ్యము చేయుచుండెను.

ఈరాజు గొప్పధనవంతుఁడు. ఇతని సైన్యము, ధనము, మఱియు నితర మైనవస్తువులు నుత్తరహిందూస్థానపురాజుల సైన్యము మొదలైన వానితో సరిపోల్చఁబడునపుడు వారందఱు నితనికంటెఁ దక్కువవారై యుందురు.

షెటాబీఖాను, రామచందరదేవువద్ద దాఁగొనియున్నప్పు డితని మూఁడులక్షలకాల్బలము, ముప్పదివేలగుఱ్ఱపుదళము, తనరాజ్యము చుట్టుపట్ల నున్న దేశపురాజు లైనవిద్యాధర్, హరిశ్చంద్రుఁడు, ఇంకను మఱికొందఱు టెలింగానా దేశపురాజులు, గలసైన్యముఁ గూర్చికొని పాధిషా నెదిరించుటకు సిద్ధిపడెను. పాదిషా యీసంగతి వినఁగా